AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెట్రోల్ బంకుల్లో క్యూలైన్లు.. ఇంధన కొరతా ??

పెట్రోల్ బంకుల్లో క్యూలైన్లు.. ఇంధన కొరతా ??

Phani CH
|

Updated on: Mar 06, 2026 | 7:48 PM

Share

పశ్చిమాసియా యుద్ధం కారణంగా అంతర్జాతీయ చమురు సరఫరాపై ప్రభావం పడుతుందనే వదంతులు భారత్‌లో పెట్రోల్ పంప్‌ల వద్ద భారీ క్యూలకు దారితీశాయి. ఇంధన ధరల పెరుగుదల, కొరత భయంతో ప్రజలు ఆందోళనగా కొనుగోళ్లు చేస్తున్నారు. అయితే, దేశంలో ప్రస్తుతం ఇంధన కొరత లేదని, సరఫరా సాధారణంగా ఉందని పెట్రోల్ డీలర్ల సంఘాలు, ప్రభుత్వం స్పష్టం చేశాయి. భారత్ వద్ద వారాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని, వదంతులు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

పశ్చిమాసియాలో ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీని ప్రభావం అంతర్జాతీయ చమురు సరఫరాపై పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్నాయి. నిన్న తెలంగాణలోని హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద జనం భారీగా క్యూ కట్టగా.. నేడు అదే సీన్ మహారాష్ట్రలోనూ రిపీట్ అయింది. గురువారం పర్భణి, ఛత్రపతి సంభాజీ నగర్ వంటి నగరాల్లో వాహనదారులు పెట్రోలు బంకుల ముందు భారీగా క్యూలో నిలబడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భవిష్యత్తులో ఇంధన ధరలు భారీగా పెరగవచ్చని, లేదంటే సరఫరా పూర్తిగా నిలిచిపోవచ్చనే తప్పుడు ప్రచారాలను నమ్మి, ప్రజలు తమ వాహనాల్లో ఇంధనాన్ని నింపుకునేందుకు పోటీ పడుతున్నారు. అయితే ఈ గందరగోళంపై పెట్రోలు డీలర్ల సంఘాలు, ప్రభుత్వ యంత్రాంగం స్పందించాయి. దేశంలో ప్రస్తుతం ఎటువంటి ఇంధన కొరత లేదని, సరఫరా వ్యవస్థ సాధారణంగా కొనసాగుతోందని వారు స్పష్టం చేశారు. కేవలం వదంతులను నమ్మి అనవసరంగా ఆందోళన చెందవద్దని, బంకుల వద్ద రద్దీ పెంచడం వల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగుతాయని విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయమే.. వారిని పెట్రోల్ బంకులవైపు పరుగులు తీసేలా చేస్తోంది. ఇక భారత ప్రభుత్వం ఇంధన సరఫరా విషయంలో అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తోంది. దేశంలో కొన్ని వారాలకు సరిపడా చమురు నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలో ఏవైనా ఆటంకాలు ఏర్పడినా, ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోవడానికి, వ్యూహాత్మక నిల్వలను వినియోగించుకోవడానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ ని మూసివేయడంతో ఈ వదంతులు ఇంకా వేగంగా వ్యాపిస్తున్నాయని, అయితే అవన్నీ అసత్యాలని ప్రభుత్వం కొట్టిపారేసింది. ప్రస్తుతానికి పెట్రోలు బంకుల వద్ద బారులు తీరాల్సిన అవసరం లేదని, వదంతుల కంటే ప్రభుత్వ అధికారిక ప్రకటనలనే నమ్మాలని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Telangana: తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోండి ఇలా

Sonu Sood: దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు సోనూ సూద్ అభయం

ఒంటిమిట్ట రాముడికి భక్తుడి భారీ విరాళం..

ఇక గాడిదలు కాయటం.. వారికి మాత్రం కోట్ల లో వ్యాపారం

టెక్నాలజీ అంటే ఇదేరా సామీ.. పనిదొంగను పట్టేసిన AI

Follow Us