AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు!

లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు!

Phani CH
|

Updated on: Jul 28, 2026 | 7:23 PM

Share

హైదరాబాద్ మియాపూర్‌లో డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పి రూ.20 లక్షలు మోసం చేసిన అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రసాయనాలతో నల్ల కాగితాలను కరెన్సీగా మారుస్తామని నమ్మించి నగదు కాజేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్న పోలీసులు నగదు, రసాయనాలు, నల్ల కాగితాలు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిని నమ్మవద్దని ప్రజలకు హెచ్చరించారు.

హైదరాబాద్‌లో మరో ఫేక్‌ కరెన్సీ గ్యాంగ్‌ అరెస్ట్‌ అయింది. డబ్బులు రెట్టింపు పేరుతో 20 లక్షల మోసం చేసిన ముఠాను మియాపూర్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నకిలీ కరెన్సీని రసాయనాల సహాయంతో రెట్టింపు చేస్తామని నమ్మించి 20 లక్షలు కాజేసిన అంతర్రాష్ట్ర మోసగాళ్ల ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. జులై 20న శ్రీకృష్ణకాంత్ వడ్లాని అనే వ్యాపారవేత్త మియాపూర్ పోలీసులను ఆశ్రయించారు. వ్యాపారవేత్తలుగా పరిచయం చేసుకున్న ఇద్దరు వ్యక్తులు ముందుగా నల్లని కాగితాలను రసాయనాలతో ప్రాసెస్ చేసి కరెన్సీ నోట్లుగా మార్చినట్టు మాయాజాలం చేశారు. 20 లక్షల నగదును ఒక పెట్టెలో ఉంచి, ప్రత్యేక రసాయనం తీసుకొచ్చే వరకు పెట్టెను తెరవవద్దని చెప్పి అక్కడినుంచి పరారయ్యారు. ఎంతసేపటికీ వారు రాకపోవడంతో బాధితుడు పెట్టెను తెరిచి చూడగా నగదుకు బదులుగా తెల్ల కాగితాలు, రంగుల ఫొటో కాపీ షీట్లు మాత్రమే కనిపించాయి. దీంతో.. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రత్యేక దర్యాప్తు బృందం సాంకేతిక ఆధారాలు, వివిధ క్లూస్ ఆధారంగా నిందితులను గుర్తించింది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితుల దగ్గర నుంచి మోసం చేసి కాజేసిన నగదుతో పాటు రసాయనాలు, నల్ల కాగితాలు లాంటి ఇతర సామాగ్రిని మియాపూర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో ఫోకౌ, రోలిన్ అనే ఇద్దరు వ్యక్తులు అత్తాపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఔరామ్ అనే వ్యక్తి న్యూఢిల్లీ వసంత్ కుంజ్‌లో నివాసం ఉంటున్నట్టు పోలీసులు వెల్లడించారు. వీరంతా కామెరూన్, మాలి దేశాలకు చెందినవారని తెలిపారు. డబ్బు రెట్టింపు చేస్తామంటూ వచ్చే ప్రలోభాలను నమ్మవద్దని సైబరాబాద్ పోలీసులు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల

మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు

తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..

Viral Video: పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా?

Chiranjeevi: రమేష్‌ కుటుంబానికి చిరంజీవి సాయం!

Follow Us