AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmi Gautam: 'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

Rashmi Gautam: ‘నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

Phani CH
|

Updated on: Sep 26, 2026 | 6:36 PM

Share

యాంకర్‌, నటి రష్మీ గౌతమ్‌ జంతు సంరక్షణ అంశాలపై తరచూ స్పందిస్తుంటారు. తాజాగా తనను విమర్శించే వారిని ఉద్దేశిస్తూ సోషల్‌ మీడియాలో ఘాటుగా స్పందించారు. తనను అవమానించినా పట్టించుకోనని, అయితే జంతు సంరక్షణ కోసం అధికారులను ప్రశ్నించాలని సూచించారు. జంతు సంరక్షణ కేంద్రాల పరిస్థితి, ప్రభుత్వ పశువైద్య ఆసుపత్రుల్లో సదుపాయాలు, వీధి కుక్కలు, పిల్లులకు వ్యాక్సిన్లు, సంతాన నియంత్రణ వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఆమె పోస్ట్‌ సోషల్‌ మీడియాలో చర్చకు దారితీసింది.

టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్‌గా రాణిస్తూనే కొన్ని సినిమాలు కూడా చేసింది. నటనతో పాటు తనవంతుగా సమాజం కోసం ప్రశ్నిస్తూనే ఉంటోంది. ముఖ్యంగా మూగజీవాల కోసం తన వంతు ప్రయత్నంగా ఏదో ఒక రూపంలో పోరాడుతోంది. అయితే ఏదైనా మంచిపని చేసేవారిపైనే విమర్శలు వస్తుంటాయి. అలా రష్మీపై కూడా చాలామంది ట్రోల్స్ చేస్తుంటారు. అలాంటి వారికి తనదైన స్టైల్లోనే కౌంటరిస్తుంది. తాజాగా రష్మీ మరో ఘాటుగా విమర్శించింది. నన్ను ఏమన్నా ఫర్వాలేదు కానీ.. మీరు ప్రశ్నించకపోతే మూగజీవాల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ట్వీట్ చేసింది. ఇంతకీ తన ట్వీట్‌లో ఏం రాసుకొచ్చిందో మనం కూడా తెలుసుకుందాం. రష్మీ ట్వీట్‌లో ఏం రాసుకొచ్చిందంటే.. ..’నన్ను అవమానించండి.. నన్ను కించపరచండి..నన్ను దూషించండి.. నేను వాటిని పట్టించుకోను.. కానీ మీరు అధికారులను ప్రశ్నించడం ప్రారంభించకపోతే..ఆ డబ్బు ఎక్కడికి వెళ్తోంది? జంతు సంరక్షణ కేంద్రాలు ఎందుకు అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి? ప్రభుత్వ పశువైద్య ఆసుపత్రులలో ఎందుకు సరైన సదుపాయాలు లేవు? వీధి కుక్కలకు, పిల్లులకు ఎందుకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు, టీకాలు వేయడం లేదు? ఆవులు, గేదెల యజమానులకు ఎందుకు సరైన మార్గదర్శకాలు జారీ చేయడం లేదు? వన్యప్రాణులు మానవ నివాసాల్లోకి ఎందుకు ప్రవేశిస్తున్నాయి? ఇక తర్వాతి తరానికి చూడటానికి పచ్చదనం ఏమైనా ఉంటుందా? వినియోగం గురించి మర్చిపోండి.. నన్ను విమర్శించడం వల్ల మీకు ఎలాంటి సహాయం అందదు.. అందుకే మీ శక్తిని, సమయాన్ని తెలివిగా ఉపయోగించండి.’ట్రోల్స్ చేసేవారికి గట్టిగానే ఇచ్చిపడేసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Srikanth Odela: ‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

Hanuman Ansh: 400 కోట్ల వైపు పరుగులు.. 2 కోట్ల చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

The Paradise: నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

The Paradise: టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌

భూమి కొనేముందు.. ఈ నిజాలు తెలియకపోతే..నష్టపోతారు!

Follow Us