Hanuman Ansh: 400 కోట్ల వైపు పరుగులు.. 2 కోట్ల చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ వద్ద అసాధారణ వసూళ్లు సాధించినట్లు కథనం పేర్కొంది. 47వ రోజున కూడా సుమారు రూ.5 కోట్ల కలెక్షన్స్‌తో, ఇప్పటివరకు రూ.366 కోట్ల గ్రాస్, రూ.200 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలిపింది. మరోవైపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘టాక్సిక్’ కలెక్షన్స్‌తో ఈ సినిమాను పోలుస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ గణాంకాలపై అధికారిక ధృవీకరణ అవసరం.
బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సృష్టిస్తున్న సంచలనాలు, భారీ బడ్జెట్ చిత్రాల పరాజయాలు తరచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా ‘హనుమాన్ అంశ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధిస్తూ రూ. 400 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది. హనుమాన్ భక్తుడైన ప్రసిద్ధ నీమ్ కరోలి బాబా బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన 47వ రోజున కూడా దాదాపు రూ. 5 కోట్ల వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. రూ. 2 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 366 కోట్ల గ్రాస్, రూ. 200 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా మొదటి రోజు కేవలం రూ. 10 లక్షల వసూళ్లతో మొదలై, ఫస్ట్ వీక్ ముగిసేసరికి రూ. 1.08 కోట్లు రాబట్టింది. రెండో వారంలో కేవలం రూ. 40 లక్షలు మాత్రమే వసూలు చేయడంతో రెండు వారాల మొత్తం కలెక్షన్ రూ. 1.48 కోట్లకు పరిమితమైంది. అయితే మూడో వారం నుంచి ఊహించని విధంగా పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు భారీగా పుంజుకున్నాయి. కాగా ఈ డిమాండ్ చూసి ఈ చిత్ర తెలుగు హక్కులను దర్శకుడు త్రివిక్రమ్ మొదట కొనుగోలు చేసినప్పటికీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల డ్రాప్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు వెర్షన్ విడుదల కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, ‘హనుమాన్ అంశ్’ అసాధారణ విజయాన్ని పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ ఫలితంతో పోలుస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. దాదాపు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘టాక్సిక్’ చిత్రం మొత్తం రూ. 342 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించింది. ఈ చిత్రాన్ని రూ. 400 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మగా చివరికి రూ. 160 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి భారీ నష్టాలను మిగిల్చింది. రూ. 2 కోట్ల బడ్జెట్ సినిమా రూ. 200 కోట్ల షేర్ రాబడితే రూ. 450 కోట్ల సినిమా డిజాస్టర్‌గా మిగిలిందంటూ బాక్సాఫీస్ లెక్కలతో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
The Paradise: నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
The Paradise: టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్
భూమి కొనేముందు.. ఈ నిజాలు తెలియకపోతే..నష్టపోతారు!
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
Depression: ఫేక్ నవ్వు వెనుక దాగిన బాధ.. మనసు మాట వినండి బ్రో.. నువ్వు డిప్రెషన్‌ను జయిస్తావు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..
మెడలో కొండచిలువతో యువతి డ్యాన్స్.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన

