రెండడుగుల గేదె!..వామ్మో .. దీని ధర రూ.1 కోటి అంట!

×

రెండడుగుల గేదె!..వామ్మో .. దీని ధర రూ.1 కోటి అంట!

రాజస్థాన్‌లోని ప్రసిద్ధ పుష్కర్ పశువుల మేళా ఇప్పుడు ఒక వింత గేదె కారణంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భారీ శరీరంతో, ఎక్కువ ఎత్తులో ఉండే గేదెలకు భిన్నంగా, కేవలం రెండడుగుల ఎత్తు మాత్రమే ఉన్న పింకీ అనే బుల్లి గేదె సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ పింకీ గేదె ధర ఏకంగా కోటి రూపాయలు అని దాని యజమాని చెబుతుండడంతో, అందరి దృష్టి దీనిపైనే పడింది. మహారాష్ట్రలోని థానే ప్రాంతం నుండి సుమారు 1100 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ గేదెను యజమాని పుష్కర్ మేళాకు తీసుకువచ్చారు. పింకీని చూసిన వారెవరైనా ఆశ్చర్యానికి గురవుతున్నారు. దాని చుట్టూ గుమిగూడి ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ సందర్శకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన ప్రత్యేకమైన చిన్న ఆకారంతో, పింకీ గేదె ఈ మేళాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాని ముద్దైన రూపమే దాని ప్రత్యేకతకు ప్రధాన కారణం.

Phani CH