AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముచ్చింతల్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఘనంగా దీపోత్సవం

ముచ్చింతల్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఘనంగా దీపోత్సవం

Samatha J
|

Updated on: Nov 25, 2026 | 12:30 PM

Share

కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణలోని ముచ్చింతల్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఆంధ్రప్రదేశ్‌లోని డోకిపర్రు శ్రీ వెంకటేశ్వరాలయాల్లో ఘనంగా దీపోత్సవాలు జరిగాయి. వేలాది దీపాల వెలుగులతో రెండు ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, సామూహిక దీపారాధన చేశారు, దైవచింతనలో మునిగారు.

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలు అద్భుతమైన ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిశాయి. ఈ శుభ దినాన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ (సమతామూర్తి) ప్రాంగణం, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా డోకిపర్రు శ్రీ వెంకటేశ్వరాలయం కార్తీక దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. భక్తుల జయజయధ్వానాలు, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది.ముచ్చింతల్‌లో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి మంగళశాసనాలతో ఈ ఆధ్యాత్మిక వేడుకను ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలతో సామూహిక దీపారాధన చేశారు. వేలాది దీపాల కాంతులతో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాంగణం కళకళలాడింది. ఈ వేడుకల్లో మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.అటు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు మహా పుణ్యక్షేత్రంలోనూ కార్తీక శోభ అంబరాన్నంటింది. శ్రీ వెంకటేశ్వరాలయ ప్రాంగణంలో దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అధినేత వెంకటకృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో కోటి వత్తిక దీపోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం నుంచే స్వామివారికి అభిషేకం, అర్చన, ప్రత్యేక పూజలు జరిపారు.

మరిన్ని వీడియోల కోసం :

తిరుప్పరంకుండ్రంలో వెలిగిన కార్తీకదీపం

సముద్ర గర్భంలో శత్రువుల కదలికలకు ఇక కాలం చెల్లినట్టేనా?

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి బలి

ఆన్‌లైన్‌లో వెయిట్‌లాస్ ఇంజెక్షన్ల అమ్మకాన్ని పసిగట్టిన TG SAFE అధికారులు

తమిళనాట మరో జయలలితగా త్రిష ?

Follow Us