మెగా ఎల్‌నినో ప్రభావంతో కరువు కాటకాలు తప్పవా ?
పసిఫిక్ మహాసముద్రంలో, ముఖ్యంగా పెరూ తీరం, గాలపాగోస్ దీవుల వద్ద 10°C వరకు ఉష్ణోగ్రతలు పెరగడంతో "మెగా ఎల్‌నినో" ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ నుండి 2027 మార్చి వరకు ప్రపంచవ్యాప్తంగా విపరీత వాతావరణ మార్పులు, కరువులు, వరదలు, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడతాయని అంచనా.
ప్రపంచం మరోసారి ప్రకృతి ప్రకోపానికి వణికిపోనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దక్షిణ అమెరికాలోని పెరూ తీరం, గాలపాగోస్ దీవుల సమీపంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏకంగా 10 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనిని సైంటిస్టులు “మెగా ఎల్‌నినో”గా అభివర్ణిస్తున్నారు. గతంలో మూడు, నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వడగాలులు, కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోయారు. ఇప్పుడు కొన్నిచోట్ల 10 డిగ్రీలకు చేరడం పెను సవాలుగా మారింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ కూడా ఇది చరిత్రలో అత్యంత తీవ్రమైన ఎల్‌నినోలలో ఒకటిగా నిలిచిపోతుందని అంచనా వేసింది. డిసెంబర్ నుంచి దీని విధ్వంసకర ప్రభావం మొదలై 2027 మార్చి వరకు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కరువులు, వరదలు, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
తిరుప్పరంకుండ్రంలో వెలిగిన కార్తీకదీపం
సముద్ర గర్భంలో శత్రువుల కదలికలకు ఇక కాలం చెల్లినట్టేనా?
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి బలి
ఆన్‌లైన్‌లో వెయిట్‌లాస్ ఇంజెక్షన్ల అమ్మకాన్ని పసిగట్టిన TG SAFE అధికారులు
తిరుప్పరంకుండ్రంలో వెలిగిన కార్తీకదీపం
డబ్బుల వర్షం కురిపిస్తామంటూ అఘోరీ పూజలు.. యువకుడు బలి!
గుప్తనిధుల పేరుతో ఘరానా మోసం.. నకిలీ బంగారంతో బురిడీ
అనంత్ అంబానీ మంచిమనసు కాలు విరిగిన ఏనుగు పిల్లకు చికిత్స
రూ.40 లక్షలు ఇచ్చారు..తీరా కట్టలు విప్పిచూసి లబోదిబోమన్న వ్యాపారి
బస్టాండ్‌లో కనువిందు చేస్తున్న అరుదైన దృశ్యం
రూ.928 ఇచ్చి.. రూ.8.23 లక్షలు కొట్టేశారు

