అర్ధరాత్రి ఇంట్లో చొరబడిన అనుకోని అతిథి
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని సిర్నపల్లి గ్రామంలో అర్ధరాత్రి ఓ భారీ కొండచిలువ ఇంట్లోకి చొరబడింది. కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా, శబ్దాలు విని యజమాని మేల్కొన్నారు. కొండచిలువను చూసి షాక్‌కు గురైన కుటుంబం పోలీసులకు సమాచారం అందించగా, స్నేక్ క్యాచర్ ఆశ్రల్ దాన్ని సురక్షితంగా బయటకు తీశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్నపల్లి గ్రామంలో అర్ధరాత్రి భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. ఇంట్లోని వారంతా గాఢ నిద్రలో ఉండగా కిటికీ గుండా లోపలికి ఎంట్రీ ఇచ్చింది ఆ కొండచిలువ. సిర్నపల్లి గ్రామానికి చెందిన ఆడెపు రాజమల్లు ఇంట్లో ఈ ఘటన జరిగింది. వంటగదిలో శబ్దాలు వినిపించడంతో నిద్రలేచిన ఇంటి యజమాని రాజమల్లు అక్కడి దృశ్యం చూసి భయంతో వెనక్కి పరుగెత్తి ఇంట్లోని వారిని అలర్ట్ చేశారు. ముందుగా ఏదో పిల్లి అయి ఉంటుందని భావించినా, శబ్దాలు పెరగడంతో అనుమానం వచ్చి లేచి చూశారు. కిటికీ సమీపంలో భారీ కొండచిలువ కనిపించడంతో కుటుంబ సభ్యులంతా షాక్‌కు గురయ్యారు. ఏం చేయాలో తెలియక భయంతో బయటకు పరుగులు తీసిన కుటుంబం, వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ బ్లూ కోట్ సిబ్బంది అనిల్, రాజేంద్రప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు వెంటనే స్నేక్ క్యాచర్ ఆశ్రల్‌కు సమాచారం ఇవ్వగా, ఆశ్రల్ ఎంతో జాగ్రత్తగా ఆ భారీ కొండచిలువను పట్టుకొని సురక్షితంగా బయటకు తీసుకువెళ్లారు. కొండచిలువ బయటకు వెళ్లడంతో ఆ కుటుంబంతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో గ్రామంలో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. పోలీసులు, స్నేక్ క్యాచర్ సకాలంలో స్పందించడం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందంటూ గ్రామస్తులు వారిని అభినందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉడత భక్తి.. తనను కాపాడిన చిన్నారులతో బడికి వెళ్తూ
40 ఏళ్ల ఒంటరితనం వెనుక కన్నీటి కథ
బస్సు కోసం చూస్తుంటే.. లిఫ్ట్ ఇస్తామన్నారు.. కారు ఎక్కాక అసలు స్కెచ్ అమలు
పత్తి తీస్తున్న కూలీలు.. వెనుక ఏదో అలికిడి.. తిరిగి చూడగా గుండె ఆగినంత పనైంది
Sachin: సచిన్ స్పెషల్ మెసేజ్.. ధోనీకి భావోద్వేగ వీడ్కోలు!
అర్ధరాత్రి ఇంట్లో చొరబడిన అనుకోని అతిథి
ఉడత భక్తి.. తనను కాపాడిన చిన్నారులతో బడికి వెళ్తూ
40 ఏళ్ల ఒంటరితనం వెనుక కన్నీటి కథ
లిఫ్ట్ ఇస్తామన్నారు.. కారు ఎక్కాక అసలు స్కెచ్ అమలు
పత్తి తీస్తున్న కూలీలు.. వెనుక ఏదో అలికిడి.. తిరిగి చూడగా
బట్టల దుకాణంలో వీధికుక్కలకు ఆశ్రయం.. యజమాని పెద్ద మనసు
ఇతను కదా.. అసలైన ఓటరు అంటే

