AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉడత భక్తి.. తనను కాపాడిన చిన్నారులతో బడికి వెళ్తూ

ఉడత భక్తి.. తనను కాపాడిన చిన్నారులతో బడికి వెళ్తూ

Phani CH
|

Updated on: Nov 23, 2026 | 9:11 AM

Share

యాదాద్రి జిల్లా మోత్కూరులో అద్భుతమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నారులు కాపాడిన ఓ ఉడుత పిల్ల వారిపై అమితమైన ప్రేమను చూపిస్తోంది. రెండు నెలల క్రితం గాయపడిన ఉడుతను రక్షించిన ప్రసన్న లక్ష్మి, అంజలి, చైత్రలకు అది ఇప్పుడు తోడుగా మారింది. ఈ ఉడుత ఆ చిన్నారులతో కలిసి ప్రతిరోజూ బడికి వెళ్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సాధారణంగా మనుషులను చూస్తే పారిపోయే ఉడుతలు, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో మాత్రం అందుకు భిన్నమైన బంధాన్ని పెంచుకున్నాయి. అక్కడి చిన్నారుల ప్రేమకు ఓ ఉడుత పిల్ల పూర్తిగా అలవాటుపడి, వారి వెంట బడికి వెళ్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. రెండు నెలల క్రితం పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా, మోత్కూరుకు చెందిన అక్కాచెల్లెళ్లు ప్రసన్న లక్ష్మి, అంజలి, చైత్రలకు కట్టెల మధ్య ఇరుక్కుపోయిన ఓ ఉడుత పిల్ల కనిపించింది. దాని పరిస్థితి చూసి చలించిపోయిన ఆ చిన్నారులు, ఉడుతను రక్షించి ఇంటికి తీసుకువెళ్లారు. దానికి ఆహారం అందిస్తూ కంటికి రెప్పలా చూసుకున్నారు. వారి ఆదరణకు, ప్రేమకు ఆ ఉడుత పిల్ల పూర్తిగా వారి కుటుంబ సభ్యురాలిగా మారిపోయింది. ఇప్పుడు ఉడుత ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లతో కలిసి ఎంతో చనువుగా ఉంటోంది. వారు పెట్టే తిండిని ఇష్టంగా తినడమే కాకుండా, వారితో ఆడుకుంటుంది. అంతేకాకుండా, చిన్నారులు పాఠశాలకు వెళ్లేటప్పుడు వారి వెంట బడికి వెళ్లి, తిరిగి ఇంటికి వస్తోంది. మూగజీవిని కాపాడిన చిన్నారుల మంచి మనసును, వారికి కృతజ్ఞతగా ఉడుత ప్రవర్తిస్తున్న తీరును చూసి మోత్కూరు వాసులు మురిసిపోతున్నారు. మానవ-జంతువుల మధ్య ఉండే నిజమైన ప్రేమకు ఈ అరుదైన బంధం నిదర్శనంగా నిలుస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

40 ఏళ్ల ఒంటరితనం వెనుక కన్నీటి కథ

బస్సు కోసం చూస్తుంటే.. లిఫ్ట్‌ ఇస్తామన్నారు.. కారు ఎక్కాక అసలు స్కెచ్‌ అమలు

పత్తి తీస్తున్న కూలీలు.. వెనుక ఏదో అలికిడి.. తిరిగి చూడగా గుండె ఆగినంత పనైంది

Sachin: సచిన్‌ స్పెషల్‌ మెసేజ్‌.. ధోనీకి భావోద్వేగ వీడ్కోలు!

PUC Rules 2026: కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారికి భారీ ఊరట!

Follow Us