40 ఏళ్ల ఒంటరితనం వెనుక కన్నీటి కథ
ముంబైలో నివసించిన లలితా కృష్ణమూర్తి 40 ఏళ్ల ఒంటరి జీవితం తర్వాత మరణించారు. ఆమె మరణానంతరం కుమార్తెలను గుర్తించేందుకు బంధువులు పత్రికా ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. ఇది వృద్ధ తల్లిదండ్రులతో కేవలం ఆర్థిక సహాయం కాకుండా, వారితో సమయం గడపడం, మాట్లాడటం, మానసిక భరోసా ఇవ్వడం ఎంత ముఖ్యమో మనకు గుర్తుచేస్తుంది.
లలితా కృష్ణమూర్తి కథ మనకు కుటుంబ సంబంధాల ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ముంబైలో నివసించిన ఈమె చెన్నై స్వస్థలం. దాదాపు 40 ఏళ్లుగా ఒంటరిగానే జీవించారు. నవంబర్ 13న ఆమె మరణించిన తర్వాత వెలుగులోకి వచ్చిన విషయాలు ఎంతో బాధను కలిగించాయి. లలితా కృష్ణమూర్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నప్పటికీ, వారు ఎక్కడున్నారో కుటుంబ సభ్యులకు తెలియలేదు. దీంతో బంధువులు ఒక వార్తాపత్రికలో మరణవార్త ప్రకటన ఇచ్చి, కుమార్తెలను లేదా ఇతర బంధువులను సంప్రదించాల్సిందిగా కోరారు. ఒక వ్యక్తి మరణానంతరం వారి కుటుంబ సభ్యుల కోసం ఇలా వెతకాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం. చివరికి, ఆమె అంత్యక్రియల బాధ్యతను బంధువులు, చుట్టుపక్కల వారు చేపట్టారు. ఈ ఘటన గురించి ఫైనాన్షియల్ నిపుణులు కిషోర్ సుబ్రమణియన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డబ్బు పంపడం మాత్రమే కాదు, తల్లిదండ్రులతో మాట్లాడటం, వారిని పలకరించడం, వారికి మనం ఉన్నామనే భరోసా ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన ద్వారా మనం అర్థం చేసుకోవాలి. మన బిజీ జీవితంలో వారికి కేటాయించే ఐదు నిమిషాలు ఎంతో విలువైనవి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బస్సు కోసం చూస్తుంటే.. లిఫ్ట్ ఇస్తామన్నారు.. కారు ఎక్కాక అసలు స్కెచ్ అమలు
పత్తి తీస్తున్న కూలీలు.. వెనుక ఏదో అలికిడి.. తిరిగి చూడగా గుండె ఆగినంత పనైంది
Sachin: సచిన్ స్పెషల్ మెసేజ్.. ధోనీకి భావోద్వేగ వీడ్కోలు!
PUC Rules 2026: కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారికి భారీ ఊరట!
రూ.9 కోట్ల మందు.. ఇప్పుడు రూ.2.5 లక్షలకే! ఈ డాక్టర్ నిజంగా దేవత..
40 ఏళ్ల ఒంటరితనం వెనుక కన్నీటి కథ
లిఫ్ట్ ఇస్తామన్నారు.. కారు ఎక్కాక అసలు స్కెచ్ అమలు
పత్తి తీస్తున్న కూలీలు.. వెనుక ఏదో అలికిడి.. తిరిగి చూడగా
బట్టల దుకాణంలో వీధికుక్కలకు ఆశ్రయం.. యజమాని పెద్ద మనసు
ఇతను కదా.. అసలైన ఓటరు అంటే
రెండు చేతులూ కోల్పోయినా ధైర్యం వీడలేదు..
చెత్త బండే అమ్మ ఒడి!..బిడ్డల కోసం స్టీరింగ్ పట్టిన యువతి!

