వాహనదారులకు అలర్ట్‌.. ఇన్సూరెన్స్ లేకపోతే తప్పదు భారీ ఫైన్‌

×

వాహనదారులకు అలర్ట్‌.. ఇన్సూరెన్స్ లేకపోతే తప్పదు భారీ ఫైన్‌

రోడ్డుపై వాహనం నడిపే ప్రతీ ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్‌తో పాటు మోటార్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. అయితే, చాలా మంది వాహనదారులు ఇన్సూరెన్స్ గడువు ముగిసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేసేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక నూతన వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ద్వారా టోల్ ప్లాజాల వద్ద వాహన ఇన్సూరెన్స్ వివరాలను ఆటోమేటిక్‌గా గుర్తించవచ్చు. ప్రస్తుతం ఢిల్లీలోని ముడ్కా టోల్ ప్లాజా వద్ద పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ వ్యవస్థను అమలు చేస్తున్నారు. వాహనం టోల్ ప్లాజాను దాటేటప్పుడు, దాని నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేసి, వాహన్ డేటాబేస్‌లో ఉన్న ఇన్సూరెన్స్ వివరాలతో పోల్చి చూస్తారు. ఒకవేళ వాహనానికి ఇన్సూరెన్స్ గడువు ముగిసి ఉంటే, తక్షణమే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది. ఈ ఎస్ఎంఎస్‌లో వెంటనే ఇన్సూరెన్స్‌ను రెన్యువల్ చేసుకోవాలని హెచ్చరిస్తారు. మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే మొదటిసారి ₹2,000 వరకు, రెండోసారి ₹10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా, కోర్టు కేసును కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాలకు ఈ విధానాన్ని విస్తరిస్తారు. NHAI కేవలం ఇన్సూరెన్స్ తనిఖీలే కాకుండా, హైవేలపై అక్రమ పార్కింగ్, ధాబాలు, ఆక్రమణలపై కూడా చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా 595 అక్రమ పార్కింగ్ ప్రాంతాలను గుర్తించి తొలగించే పనిలో ఉంది. కాబట్టి, ఇకపై హైవేపై వెళ్లే ముందు మీ వాహన ఇన్సూరెన్స్‌ను తప్పకుండా తనిఖీ చేసుకోండి.

Phani CH