Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలరామాయణం సినిమాలో నటించి మెప్పించాడు. అంతకు ముందు బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో నటించాడు. 2001లో వచ్చిన నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అదే ఏడాది వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్టీఆర్ కు మంచి హిట్ ఇచ్చింది. అదే ఏడాది సుబ్బు అనే సినిమా చేశాడు. ఈ సినిమా నిరాశపరిచింది. ఆ వెంటనే వచ్చిన ఆది సినిమా భారీ విజయాన్నిఅందుకుంది. ఇలా ఒకే ఏడాది లో నాలుగు సినిమాలు చేసి రెండు భారీ విజయాలను అందుకున్నాడు ఎన్టీఆర్.

ఇక ఎన్టీఆర్ డాన్స్ కు , యాక్టింగ్ కు, డైలాగ్ డెలివరీకి ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు . దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం గా తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించాడు తారక్. ఇక ఇప్పుడు దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‎గా నటిస్తుంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇంకా చదవండి

ఇదెక్కడి రచ్చ మావ..! చేసింది చిన్న పాత్ర.. ఓవర్ నైట్‌లో స్టార్ డమ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హాట్ బ్యూటీ

చాలా మంది నటీనలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది ఒకేఒక్క సినిమాతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ చిన్నది చేసింది చిన్న పాత్రే అయినా.. విపరీతంగా పాపులర్ అయ్యింది. అలాగే స్టార్ హీరోయిన్స్ కు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె ఎవరో తెలుసా.?

Jr.NTR : వేట మొదలు.. ప్రశాంత్ నీల్ సినిమా కోసం బయలుదేరిన ఎన్టీఆర్.. పవర్ ఫుల్ లుక్‏లో తారక్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో తారక్ న్యూలుక్ గురించి విపరీతమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల అర్జున్ s/o వైజయంతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ పూర్తిగా సన్నబడి కనిపించడంతో అసలు ఏం జరిగిందంటూ ఆందోళనకు గురయ్యారు ఫ్యాన్స్.

Jr.NTR: వామ్మో.. ఇంత రేట్ ఏంది భయ్యా.. ఎన్టీఆర్ వేసుకున్న షర్ట్ ధర తెలిస్తే ఫ్యూజులవుట్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సౌత్ ఇండస్ట్రీలోని అత్యంత డిమాండ్ ఉన్న హీరోలలో ఒకరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ హీరోకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం హిందీలో వార్ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు తారక్.

Tollywood News: తారక్‎పై భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌.. త్వరలో సెట్స్‌లోకి చిరు..

ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్. రెట్రో సినిమా రిలీజ్‌కు ముందు అభిమానులతో సూర్య. త్వరలో అనిల్ రావిపూడి మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. హరి హర వీరమల్లు సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు దర్శకుడు జ్యోతి కృష్ణ.  ఫైనల్‌గా సితారే జమీన్‌ పర్ ప్రమోషన్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు ఆమిర్ ఖాన్‌. 

వాడు నా అయ్యా అంటూ అదరగొట్టిన శ్రీహరి.. ఆ హీరో పేరు చెప్పగానే ఆడిటోరియం దద్దరిల్లింది…

విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీహరి. విలన్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీహరి ఆతర్వాత హీరోగా సినిమాలు చేశారు. ఎన్నో సినిమాల్లో ఆయన వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించాడు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు, సాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి.

పవన్, చరణ్ ను.. ఎన్టీఆర్ ఫాలో అవ్వాల్సిందే

ఇప్పుడు మన స్టార్ హీరోలకు ఫ్యాన్స్‌తో పెద్ద చిక్కొచ్చి పడింది. వారి వారి బర్త్‌డేలొస్తే చాలు.. భయపడి ఉలిక్కిపడి.. తలపట్టుకోవాల్సిన పరిస్థితి మన హీరోలకు వచ్చింది. మే20 యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌ డే కావడంతో.. ఇప్పుడు ఎన్టీఆర్‌కు కూడా అదే పరిస్థితి వచ్చేలా ఉంది. దీంతో తారక్ తప్పక మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ను.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఫాలో అవ్వాల్సిన పరిస్థితి.

  • Phani CH
  • Updated on: Apr 18, 2025
  • 1:34 pm

Prabhas and Jr. NTR: డార్లింగ్ అండ్ తారక్.. ఇద్దరిలో ఓ పోలిక.. ఏంటా సిమిలారిటీ.?

అనుకుని చేసినా, అనుకోకుండా అలా జరిగిపోయినా.. ప్రభాస్‌, తారక్‌ విషయంలో మాత్రం ఓ పోలిక కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఈ ఇయర్‌ ఇద్దరి కెరీర్‌ని గమనిస్తే, ఈ విషయం ఇట్టే అర్థమవుతుందంటున్నారు. ఇంతకీ ఏంటా కామన్‌ పాయింట్‌.

Prasanth Neel: ప్రశాంత్‌ నీల్‌కు కొత్త తలనొప్పులు.. హోం గ్రౌండ్‌లో చిక్కులు..

ప్రజెంట్ నేషనల్ లెవల్‌లో మోస్ట్ క్రేజీయస్ట్ దర్శకుల్లో ప్రశాంత్ నీల్‌ కూడా ఒకరు. కేజీఎఫ్‌ హిట్‌తో యష్‌ను పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టిన ప్రశాంత్‌నీల్‌కు ఇప్పుడు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. అదర్‌ స్టేట్స్‌లో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. హోం గ్రౌండ్‌లో మాత్రం చిక్కులు తప్పటం లేదు.

Movie Releases: 2025కి నో.. 2026పై ఫోకస్.. ఈ ఏడాది సినీ క్యాలెండర్‌ వీక్‌ కానుందా.?

పాన్‌ ఇండియా ట్రెండ్‌లో స్టార్ హీరోల సందడి బాగా తగ్గిపోతోంది. హీరోలు ఒకే ప్రాజెక్ట్ మీద రెండు మూడేళ్లు వర్క్‌ చేస్తుండటంతో కొన్ని క్యాలెండర్ ఇయర్స్‌లో స్టార్స్‌ సందడే లేకుండా.. ఈ ఏడాది కూడా అలాంటి షార్టేజే కనిపిస్తోంది. ఎక్కువ మంది స్టార్స్‌ 2026 మీద ఫోకస్ చేస్తుండటంతో ఈ ఏడాది సినీ క్యాలెండర్‌ వీక్‌గా కనిపిస్తోంది. ఇంతకీ ఈ ఇయర్‌ లిస్ట్‌లో ఉన్న సినిమాలేంటి? నెక్ట్స్ ఇయర్‌కు రెడీ అవుతున్న స్టార్స్ ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం.

Jr.NTR: బాబోయ్.. సింపుల్‏గా కనిపించిన చాలా కాస్ట్లీ గురూ.. దుబాయ్‏లో ఎన్టీఆర్ ధరించిన ఈ షర్ట్ ధర తెలిస్తే..

ప్రస్తుతం వార్ 2 చిత్రీకరణలో పాల్గొంటున్న జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు చాలా సన్నగా మారిపోయారు. కొన్నిరోజులుగా తారక్ స్లిమ్ అండ్ ఫిట్ బాడీ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం ఆయన బరువు తగ్గారని అంటున్నారు ఫ్యాన్స్. తాజాగా ఎన్టీఆర్ క్యాజువల్ లుక్ పోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.