AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోలీ 2025

హోలీ 2025

హిందువులు జరుపుకునే పండగల్లో రంగుల పండుగ హోలీ.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రంగుల వేడుకలను జరుపుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. రంగులు, బెలూన్స్ , లేదా కోడి గుడ్లు, టమాటా వంటివి వాటితో రంగుల కేళీ హోలీని ఆడుతారు . వివిధ ప్రాంతాల్లో వివిధ సంప్రాదయాలకు అనుగుణంగా హోలీ పండుగను జరుపుకుంటారు.

అయితే కొన్ని ప్రాంతాల్లో హోలీని ఐదు రోజుల పాటు జరుపుకుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో రెండు రోజులు ఇలా రకరకాలుగా జరుపుకుంటారు. మన దేశంలో మాత్రమే కాదు హిందూ సనాతన ధర్మాన్ని పాటించే వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా హోలీ వేడుకలను వివిధ రూపాల్లో పేర్లతో జరుపుకుంటారు.

కొన్ని చోట్ల పూలతో, మరికొన్ని చోట్ల రంగులు, గులాల్‌లతో హోలీ ఆడతారు, కొన్ని చోట్ల ధైర్యం, పరాక్రమం హోలీ వేడుకల్లో కనిపిస్తాయి. రంగుల గొప్ప పండుగ హోలీని ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు.

ఇంకా చదవండి

Lunar Eclipse: ముగిసిన చంద్రగ్రహణం.. దుష్ప్రభావాల నివారణకు ఈ పరిహారాలు చేసి చూడండి

హోలీ పండుగ రోజున సంభవించిన పాక్షిక చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ దాని ప్రభావం గురించి జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది. చంద్ర గ్రహణం కొన్ని రాశులపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. గ్రహణం విడిచిన అనంతరం పూజలు నిర్వహించాలి. గ్రహణం తర్వాత పవిత్ర స్నానం, దానధర్మాలు చేయడం ద్వారా అశుభ ప్రభావాలను తొలగించుకోవచ్చు. చంద్ర దోషం నుండి ఉపశమనం కూడా లభిస్తుంది.

Hyderabad: భారీ భద్రత నడుమ హైదరాబాద్‌లో హోలీ వేడుకలు

సంతోషాల కేళి.. సంబరాల హోలీ.. ఏటా దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకుంటాం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు రంగులు పూసుకుని ఎంతో ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు. జీవితాల్లో ఆనందాన్ని నింపడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డ్యాన్స్‌లతో ఎంజాయ్ చేస్తున్నారు. హోలీ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Holi 2025: హోలీ రోజున శివయ్య అనుగ్రహం కోసం.. వేటిని సమర్పించాలంటే..

హోలీ రోజున శివుడిని పూజించడం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. హోలిక దహనం చేసిన తర్వాత వచ్చే భస్మం, నీలం, ఎరుపు రంగులను శివలింగానికి సమర్పించడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని.. ప్రతికూలత నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. హోలీ పండుగ రోజున శివుని ఆశీస్సులు పొందడానికి ఏయే వస్తువులను ఆయనకు సమర్పించాలో ఈ రోజు తెలుసుకుందాం..

హోలీ వేళ ప్రత్యేకత చాటుకున్న పతంజలి.. వసంతి నవస్సాయేష్టి పూల యజ్ఞం నిర్వహించిన యోగా గురు రామ్‌దేవ్

దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాంటున్నాయి. చిన్నా, పెద్దా.. అంతా హోలీ సంబురాల్లో మునిగితేలుతున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ చేసుకుంటున్నారు. ఇక హోలీకా దహనం తర్వాత, హోలీ పండగ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఢమరుకాలు మోగిస్తూ సందడి చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో జనం రోడ్లపైకి రావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Telangana: హోలీ వేళ తెలంగాణ ప్రత్యేకం పిడిగుద్దుల ఫైట్.. ఈ ఏడాది ఉంటుందా..?

హోలీ కేరింతలు కొట్టిస్తుంది. జనమంతా రంగులు చల్లుకుంటూ పండుగ జరుపుకుంటున్నారు. హోలీ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఆనవాయితీ ప్రకారం నిర్వహించే పిడిగుద్దులాట నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే గతంలో ఓ ఏడాది ఆటను నిర్వహించకపోవడంతో గ్రామంలో పెద్ద అనర్థం జరిగిందని, పలువురు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్థులు చెబుతున్నారు.

Hyderabad Police: వాహనదారులకు హైదరాబాద్‌ పోలీసులు మాస్‌ వార్నింగ్‌

Hyderabad Police: హోలీ పండుగను దృష్టిలో ఉంచుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి బుధవారం ఒక ఉత్తర్వు జారీ చేశారు. తెలియని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు లేదా నీటిని చల్లడం లేదా రోడ్లపై వ్యక్తులను రంగులు పూయడం వంటివి చేయవద్దని హెచ్చరించారు..

Hyderabad: లిక్కర్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. రేపు మద్యం షాపులు బంద్‌!

Hyderabad: మద్యం షాపులు మూసివేస్తున్నారంటే మందుబాబులకు బ్యాడ్‌ న్యూసే. ఎందుకంటే లిక్కర్‌ ప్రియులకు మద్యం లేనిది రోజు గడవదు. అలాంటిది షాపులు బంద్‌ ఉండనున్నాయంటే అప్రమత్తమైపోతారు. ముందు రోజే మద్యాన్ని తెచ్చుకుని పెట్టుకుంటారు. మార్చి 14న మద్యం షాపులు మూసివేయనున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు..

Holi 2025: హోలీని డిఫరెంట్ గా ట్రై చేస్తారా.. 5.5 కోట్ల మందిని ఆకట్టుకున్న రంగుల బెలూన్.. మీరుకూడా ఓ లుక్ వేయండి..

దేశ వ్యాప్తంగా రంగుల పండగ సందడి మొదలైంది. కాశీలో మసాన్ హోలీని జరుపుకున్నారు. మరికొన్ని గంటల్లో రంగులతో ఆడుకోవడానికి పిల్లలు పెద్దలు రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో హోలీకి సంబంధించిన రకరకాల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒక వీడియో నెటిజన్లను ఆకర్షించింది. ఇందులో ఒక జంట ప్రజలు బెలూన్ల సహాయంతో గాలిలోకి రంగులు ఊదుతూ కనిపిస్తున్నారు. దేశీ ట్రిక్ కి సంబంధించిన ఈ రీల్ 5.5 కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.

Holi 2025: హోలీ రోజున బాల గోపాలుడికి ఈ వస్తువులను సమర్పించండి.. కోరిన కోర్కెలు నెరవేరుతాయి

ఇంట్లో ఎక్కువ మంది శ్రీకృష్ణుడిని బాలుడి రూపంలో లడ్డూ గోపాలుడిగా కొలుస్తారు. బాల స్వరూపమైన లడ్డూ గోపాల్‌ను తమ ఇళ్లలో ఉంచుకుంటారు. ఈ బాల గోపాలుడిని పండగలు, పర్వదినాల సమయంలో అందంగా అలంకరించడంతో పాటు, వివిధ రకాల నైవేద్యాలు కూడా సమర్పిస్తారు. కృష్ణాష్టమికి మాత్రమే కాదు హోలీ రోజున కూడా లడ్డూ గోపాలుడికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులను సమర్పిస్తారు. ఇలా చేయడం వలన బాల గోపాలుడి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం.

Holi 2025: హోలీకి రెడీ అవుతున్నారా.. ఇంట్లోనే సహజ రంగులను సిద్ధం చేసుకోండి.. తయారీ

రంగుల పండుగ హోలీని అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సమయంలో వివిధ రకాల రంగులను ఉపయోగిస్తారు. మార్కెట్లో అనేక రంగులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రంగులు రసాయనాలను ఉపయోగించి తయారు చేస్తారు. అటువంటి పరిస్థితిలో ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతో సహజ రంగులను తయారు చేసుకోవచ్చు.