తెలుగు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో 14 ఏళ్ల అనుభవం ఉంది..2009లో సిటీ ఛానల్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2012లో ప్రజాశక్తి,లోకల్ టైమ్స్ పేపర్లో రిపోర్టర్ గా పనిచేసాను..2014 లో 99టీవీలో ఉమ్మడి మెదక్ జిల్లా రిపోర్టర్ గా చేసాను.. 2019లో టీవీ9లో జాయిన్ అయ్యాను..ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను…
Telangana: బ్రహ్మంగారు చెప్పిన మాటలు నిజమేనేమో..! ఈ చిత్రం చూశారా..?
మాములుగా ఒక చెట్టు నీడ కింద మరో చెట్టు పుట్టినా ఎదుగుదల అంతగా ఉండదు. సూర్యరశ్మి తగలక కొన్నాళ్లకు ఆ చెట్టు ఎండిపోతుంది. కానీ ఇక్కడ ఓ రావి చెట్టు మొదల్లో ఓ ఈత చెట్టు పుట్టింది. అవి రెండు ఎంచక్కా ఎదిగాయి. దీన్నో వింతగా భావిస్తున్నారు స్థానికులు.
- P Shivteja
- Updated on: Apr 25, 2025
- 6:36 pm
Harish Rao: చిన్నారి స్పీచ్‌తో కంటతడి పెట్టిన మాజీ మంత్రి హరీష్ రావు.. అసలేం జరిగిందంటే.. వీడియో
సిద్దిపేట పట్టణంలోని మెట్రో గార్డెన్స్ లో "భద్రంగా ఉండాలి- భవిష్యత్ లో ఎదగాలి" పేరుతో పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మోటీవేషన్ తరగతులు నిర్వహించగా.. కొంత మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతుండగా.. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
- P Shivteja
- Updated on: Apr 19, 2025
- 1:50 pm
Lizard in Thums up: వామ్మో కూల్ డ్రింక్‌లో బల్లి.. కంగుతిన్న కస్టమర్! తర్వాత ఏం జరిగిందంటే!
వేసవి మొదలు కాకముందే భానుడి భగభగలు స్టార్ట్ అయ్యాయి. ఇంట్లో ఉక్కబోత, బయట వేడి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఎండతాపం నుంచి ఉపసమనం పొందేందుకు కూల్ డ్రింక్స్, ప్రూట్ జ్యూస్ వంటికి తాగుతుంటారు. ఇలానే కూల్‌డ్రింక్ తాగేందుకు వెళ్లిన ఇద్దరి యువకులకు షాక్ తగిలింది. వాళ్లలొ ఒకరు తాగిన కూల్‌డ్రింక్‌లో చనిపోయిన బల్లి ప్రత్యక్షమైంది. అది చూసిన కస్టమర్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
- P Shivteja
- Updated on: Apr 18, 2025
- 1:28 pm
మీదేం భక్తిరా నాయనా.. స్వామీజీ చెప్పులకు పూజలు.. ఇంతలోనే షాకింగ్ ఘటన.. !
భక్తి ఉండాలి కాని, మరి ఇలా పిచ్చి భక్తి కూడా ఉండకూడదు.. అతి నమ్మకం కూడా మంచిది కాదంటారు. ఇప్పటికే మన దగ్గర ఉన్న దేవుళ్ళు చాలనట్లు.. ఎంతోమంది స్వామిజీలు, బాబాలు పుట్టుకొచ్చారు. వీరికి పూజలు చేయడమే కాకుండా కొత్తగా వారి పాదుకలు (చెప్పులు)లకు పూజలు చేస్తున్నారు. తాజాగా ఇలా ఈ పాదుకల (చెప్పుల) పూజలోనే పలువురికి గాయాలు అయ్యాయి.
- P Shivteja
- Updated on: Apr 14, 2025
- 7:53 pm
Telangana: తాగి వీరంగం.. పోలీసులు రావడంతో ఊహించని పని.. కట్ చేస్తే..
పీకల దాకా మద్యం తాగాడు. ఆ మత్తులో ఇంట్లో వాళ్లతో గొడవ పడ్డాడు. బయటకు వచ్చి న్యూసెన్స్ చేశాడు. అతని గోల తట్టుకోలేక స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో ఇద్దరు కానిస్టేబుల్స్ అక్కడికి చేరుకున్నారు. వారిని చూసిన వెంటనే ఆ వ్యక్తి మరో పిచ్చి పని చేశాడు.
- P Shivteja
- Updated on: Apr 11, 2025
- 3:00 pm
రూ. 20 లక్షలతో ఉడాయించిన పొదుపు సంఘం ప్రతినిధి.. లబోమంటున్న డ్వాక్రా గ్రూప్ మహిళలు!
పైసా.. పైసా కూడబెట్టి నమ్మి అప్పజెప్పితే, మహిళలను నిండా ముంచి ఉడాయించాడు ఓ మయాగాడు. మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్వాక్రా గ్రూపులో మోసాలు జరుగుతున్నాయి.ఆ డ్వాక్రా గ్రూపులలో పనిచేసే వ్యక్తులే డబ్బులు తీసుకొని పరారవుతున్నారు. ఫలితంగా గ్రూపులో ఉన్న మహిళా సభ్యులు బలైపోతున్నారు.
- P Shivteja
- Updated on: Apr 9, 2025
- 3:39 pm
Telangana: అబ్బ.. తక్కువ ధరకే బంగారం.. ఆ అత్యాశే కొంప ముంచింది.. కట్ చేస్తే..
మాయ మాటలు నమ్మి మోసపోవడం అనేది చాలా మందికి అలవాటుగా మారింది. ఎలాంటి కష్టం లేకుండా.. షాట్‌కట్‌లో ఈజీగా డబ్బు వస్తుందంటే చాలు.. చాలా మంది ఏది చెప్పినా వింటారు.. ఏది చేయమన్నా చేస్తారు.. చివరికి మోసపోయాం.. అని తెలుసుకొని లబోదిబోమంటారు.. సరిగ్గా ఇలాంటి వారినే ఎంచుకుని.. వారిని నమ్మించి బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్ళు..
- P Shivteja
- Updated on: Apr 9, 2025
- 1:46 pm
అర్ధరాత్రి శివాలయంలో వింత శబ్ధాలు.. ఏంటా అని తొంగి చూడగా..
బిజీలిపూర్ గ్రామం లో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న హనుమాన్ దేవాలయంలో అర్ధరాత్రి ప్రవేశించిన ఒక నాగుపాము గర్భగుడిలోని శివలింగం వద్దకు చేరుకుంది. శివ లింగం వద్ద సుమారు గంటపాటు ఆ పాము పడగ విప్పి అలాగే ఉండిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్లిన గ్రామ
- P Shivteja
- Updated on: Apr 8, 2025
- 1:05 pm
Telangana: వాటే థాట్.. ఇటు డ్వాక్రా మహిళలు.. అటు రైతులకు ఏకకాలంలో లాభం…
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా స్వయం ఉపాధి కల్పించేందుకు పలు రకాల పథకాలు అందిస్తోంది కేంద్రం. ఈ ఏడాది వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అదే నమో డ్రోన్ దీదీ. మహిళా స్వయం సహాయ సంఘాల్లోని మహిళ సభ్యులకు డ్రోన్ టెక్నాలజీని పరిచయం చేయడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం.
- P Shivteja
- Updated on: Apr 7, 2025
- 2:47 pm
Telangana: పనికి వెళ్లే చోట వృద్ధ జంట ఒంటరిగా ఉండటాన్ని గమనించారు.. అంతే క్రూరులుగా మారిపోయి..
తాగుడు, జల్సాలకు అలవాటు పడి.. ఎదుటి వారి ప్రాణాలు తీయడానికి సైతం వెనుకడడం లేదు కొంతమంది. ఈజీ మనీకి అలవాటు పడి డబ్బే లక్ష్యంగా దారుణాలకు పాల్పడుతున్నారు...ఇలాగే తాగడానికి డబ్బులు లేవని ఓ వృద్ధ దంపతులను అత్యంత దారుణంగా చంపి వారి వద్ద ఉన్న బంగారం, డబ్బులు తీసుకొని పరారయ్యారు ముగ్గురు. కానీ పోలీసులు వారిని వదిలిపెట్టలేదు.
- P Shivteja
- Updated on: Apr 7, 2025
- 2:23 pm
ఆ కలెక్టర్ స్టైలే వేరు.. సైకిల్‌పై వెళ్లి ఆకస్మిక తనిఖీ.. మెదక్ కలెక్టర్‌ను చూసిన జనం ఫిదా!
చిన్న ప్రభుత్వ ఉద్యోగం రాగానే కొంతమంది మామూలుగా ఫీల్ కారు. ఇక వారి స్టయిల్ హద్దు అనేది ఉండదు. కానీ ఎప్పుడు బిజీగా ఉండే ఓ జిల్లా కలెక్టర్.. తన సింపుల్ సిటీ అంటే ఏంటో చూపించాడు. తన భార్యతో కలిసి ఒకటి కాదు రెండు 20 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కారు. మెదక్ నుండి రామయంపేట వరికు సైకిల్ తొక్కుతూ వెళ్లారు. రిటర్న్‌లో సాధారణ వ్యక్తిలాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
- P Shivteja
- Updated on: Mar 23, 2025
- 3:22 pm
Telangana: డెత్ స్పాట్లుగా మారుతున్న సాగునీటి ప్రాజెక్టులు…
సాగునీటి కోసం నిర్మించిన ప్రాజెక్టులు డెత్ స్పాట్లుగా మారుతున్నాయి. వీకెండ్స్‌లో అక్కడికు వెళ్లి నీటిలో దిగి, ప్రమాదవశాత్తూ కొంతమంది చనిపోతున్నారు. సెల్ఫీ పిచ్చి మరికొందరి ప్రాణాలు తీస్తోంది, ఇంకొందరు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి బడా రిజర్వాయర్ల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో.. ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.
- P Shivteja
- Updated on: Mar 23, 2025
- 2:27 pm