ఐపీఎల్
IPL అనేది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్. ఈ లీగ్ BCCI రిచ్ లీగ్‌గా పేరుగాంచింది. ఇది భారత క్రికెట్‌నే కాకుండా ప్రపంచ క్రికెట్ పరిస్థితి, దిశను మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
IPL మొదటి సీజన్ 2008లో జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ లీగ్ నిర్వహిస్తున్నారు. ఐపీఎల్‌లో మొత్తం 10 జట్లు ఆడుతున్నాయి. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాల్గొంటున్నాయి.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక సార్లు ఐపీఎల్‌ను గెలుచుకున్నాయి. ఈ రెండు జట్లు తలో 5 సార్లు ట్రోఫీని అందుకున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ టోర్నీని రెండుసార్లు గెలుచుకుంది. కాగా, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఒకసారి గెలిచాయి. ఇంతకు ముందు డెక్కన్ ఛార్జర్స్ జట్టు కూడా ఒకసారి ఐపీఎల్‌ను గెలుచుకుంది. అయితే, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా ఈ టైటిల్ దక్కించుకోలేకపోయింది.
IPL ప్రతి సీజన్‌కు ముందు, ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి వేలం నిర్వహిస్తారు. అందులో జట్లు ఆటగాళ్ల కోసం వేలంలో పాల్గొంటాయి. IPL ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి మే వరకు జరుగుతుంది. మ్యాచ్‌లు భారతదేశంలోని అనేక నగరాల్లో నిర్వహిస్తుంటారు.
ఐపీఎల్ ప్రత్యేకత ఏమిటంటే, ఈ లీగ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు పాల్గొనడం. అయితే, ఇందులో పాల్గొనేందుకు పాక్ ఆటగాళ్లకు అనుమతి లేదు. భారత్‌పై పాకిస్థాన్ చేస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలే ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది.