AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rani Mukerji Beauty Secrets: ఖరీదైన క్రీములకు నో చెప్పిన బాలీవుడ్ క్వీన్! మేకప్‌లో ఉంటే కూతురు ఇష్టపడదట

దశాబ్దాలు దాటినా ఆమె కళ్లలోని మెరుపు తగ్గలేదు.. వెండితెరపై ఆమె కనిపిస్తే ఇప్పటికీ కుర్రకారు గుండెల్లో గంటలు మోగుతాయి. బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ఆ నటి అందం వెనుక ఏదో పెద్ద రహస్యమే ఉందని అంతా భావిస్తుంటారు.

Rani Mukerji Beauty Secrets: ఖరీదైన క్రీములకు నో చెప్పిన బాలీవుడ్ క్వీన్! మేకప్‌లో ఉంటే కూతురు ఇష్టపడదట
Rani Mukerji
Nikhil
|

Updated on: Feb 20, 2026 | 10:44 PM

Share

కానీ ఆమెను అడిగితే మాత్రం చాలా సింపుల్ గా సమాధానం ఇస్తుంది. ఎటువంటి విదేశీ బ్యూటీ ప్రొడక్ట్స్ కాకుండా, మన ఇంట్లో అతి తక్కువ ధరకు దొరికే ఒకే ఒక్క పదార్థంతో తన అందాన్ని కాపాడుకుంటున్నానని ఆమె చెబుతోంది. అది మాత్రమే కాదు, ఆమె మేకప్ వేసుకుంటే తన సొంత కూతురే ఆమెను ఇష్టపడదట. మేకప్ వెనుక ఒక తెలియని భయం, ఎమోషన్ దాగి ఉన్నాయని ఆమె తాజాగా వెల్లడించారు. ఇంతకీ ఆ కొబ్బరి నూనె మ్యాజిక్ ఏంటి? తన కూతురు అడిరా ఎందుకు రాణిని మేకప్ లేకుండా చూడాలని కోరుకుంటుంది?

రాణి ముఖర్జీ మ్యాజిక్ వెపన్..

రాణి ముఖర్జీ తన చర్మం, జుట్టు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన కారణం ‘కొబ్బరి నూనె’ అని వెల్లడించింది. ఇటీవల ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “నేను కేవలం కొబ్బరి నూనెను మాత్రమే ఉపయోగిస్తాను. అది చర్మానికి పూసుకోవడానికైనా లేదా ఆహారంలో తీసుకోవడానికైనా కొబ్బరి నూనెను మించినది మరొకటి లేదు” అని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని తీర ప్రాంతమైన జుహూలో పుట్టి పెరగడం వల్ల అక్కడి వాతావరణం, అలవాట్లు తనపై ఎంతో ప్రభావం చూపాయని ఆమె పేర్కొన్నారు.

తీర ప్రాంతాల్లో ఉండేవారికి కొబ్బరి నూనె ఒక వరంలా పనిచేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కొండ ప్రాంతాల్లో ఉండేవారి చర్మ తత్వం, వాతావరణం భిన్నంగా ఉంటాయని.. కాబట్టి ఎవరికి ఏది సెట్ అవుతుందో అది వాడటం ఉత్తమమని సూచించారు. అయితే రాణి ముఖర్జీ కూతురు అడిరాకు మాత్రం ఆ కొబ్బరి నూనె వాసన అస్సలు నచ్చదట. ఇది ఎవరి ఇష్టానికి సంబంధించింది వారిదే అని రాణి సరదాగా చెప్పుకొచ్చారు.

మేకప్ వేసుకుంటే అడిరాకు భయం..

ఇదే సంభాషణలో రాణి తన కూతురు అడిరా గురించి ఒక ఎమోషనల్ విషయాన్ని పంచుకున్నారు. అడిరాకు తన అమ్మ మేకప్ లేకుండా ఉంటేనే చాలా ఇష్టమట. దీని వెనుక ఒక బలమైన కారణం ఉందని రాణి విశ్లేషించారు. సాధారణంగా రాణి మేకప్ వేసుకున్నారంటే ఆమె షూటింగ్ కు లేదా పని మీద బయటకు వెళ్తున్నారని అర్థం. అడిరా తన అమ్మను మేకప్ లో చూసినప్పుడల్లా ‘అమ్మ తనను వదిలి పనికి వెళ్ళిపోతుంది’ అనే అభద్రతా భావానికి లోనవుతుందని రాణి తెలిపారు.

తండ్రులు పనికి వెళ్లడం పిల్లలకు సహజంగా అనిపిస్తుంది కానీ, అమ్మ బయటకు వెళ్తుంటే వారు త్వరగా అంగీకరించలేరని రాణి చెప్పారు. రాణి తన కెరీర్ లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పాటిస్తూ కూతురు ఎదుగుదల లోని ప్రతి ముఖ్యమైన ఘట్టంలోనూ తోడుగా ఉన్నారు. అందుకే రాణి ఇంట్లో మేకప్ లేకుండా ఉన్నప్పుడు అడిరా చాలా రిలాక్స్డ్ గా, సౌకర్యవంతంగా ఫీల్ అవుతుందట. ఎందుకంటే అప్పుడు తన అమ్మ తనతోనే ఇంట్లో ఉంటుందని ఆ చిన్నారి నమ్మకం.

రాణి ముఖర్జీ మాటలను బట్టి చూస్తుంటే.. స్టార్ హోదాలో ఉన్నప్పటికీ ఆమె ఎంతటి సాదాసీదా జీవితాన్ని, సహజ సిద్ధమైన పద్ధతులను ఇష్టపడుతున్నారో అర్థమవుతుంది. ఆయుర్వేదంలో కూడా కొబ్బరి నూనెకు ఉన్న ప్రాముఖ్యతను ఆమె తన జీవనశైలిలో భాగంగా చేసుకున్నారు. ఖరీదైన మేకప్ కిట్ల కంటే, తన కుటుంబంతో గడిపే సమయమే తన ముఖంలో అసలైన వెలుగును నింపుతుందని ఆమె విశ్వసిస్తున్నారు. అమ్మతనం లోని మాధుర్యం, సహజ సిద్ధమైన సౌందర్యం కలగలిసిన రాణి ముఖర్జీ ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. కేవలం కొబ్బరి నూనెతోనే తన అందాన్ని కాపాడుకుంటున్న ఆమె చిట్కాను తీర ప్రాంతాల్లో ఉండేవారు ఖచ్చితంగా ట్రై చేయవచ్చు.

Follow Us