వరుసగా 6 ప్లాపులు.. 3 ఏళ్లుగా ఒక్క సినిమా లేదు.. ఫాలోయింగ్ చూస్తే..

Rajitha Chanti

Pic credit - Instagram

04 April 2026

2014లో నాగ చైతన్య నటించిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ పూజా హెగ్డే. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. 

పూజా హెగ్డే రెండు సంవత్సరాల తర్వాత హృతిక్ రోషన్ నటించిన 'మొహెంజో దారో' చిత్రంతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. 2018లో రంగస్థలం మూవీతో మెప్పించింది. 

రూ. 60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసింది. పూజా హెగ్డే తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. 

2019లో విడుదలైన 'హౌస్‌ఫుల్ 4' చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, అభిమానుల నుండి మంచి ఆదరణ పొందింది. కొన్నాళ్లుగా సరైన బ్రేక్ ఎదురుచూస్తుంది.

ఇటీవల ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవుతున్నాయి. తెలుగు, హిందీ, తమిళం భాషలలో ఆమె నటించిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి.

చాలా కాలం సైలెంట్ అయిన పూజా హెగ్డే.. ఇటీవల కూలీ చిత్రంలో మోనికా స్పెషల్ పాటతో సాలీడ్ కంబ్యాక్ ఇచ్చింది. ఈ పాటతో మరోసారి ఫాంలోకి వచ్చింది పూజా.

పూజా హెగ్డే గత 6 సంవత్సరాలుగా కేవలం వైఫల్యాలనే ఎదుర్కొంటోంది. ఆమెకు గత 3 సంవత్సరాలుగా పెద్ద సినిమా అవకాశాలు రాలేదు. ఆమె మరో బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది.

హెచ్. వినోత్ దర్శకత్వంలో, విజయ్ హీరోగా నటించిన 'జననాయకన్'  సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తుంది పూజా. సెన్సార్ ఇష్యూ కారణంగా ఆ సినిమా ఇప్పటికీ విడుదల కాలేదు.