31 December 2025

అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

నిధి అగర్వాల్.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు. ప్రస్తుతం ఈ అమ్మడు రాజాసాబ్ సినిమాలో నటించింది.

ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ఈ రాజాసాబ్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నారు. 

ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా రాజాసాబ్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఆస్క్ నిధి పేరుతో ఇంటరాక్షన్ అయ్యింది నిధి

ఇందులో భాగంగా ఒక నెటిజన్.. అసలు అగర్వాల్స్ ఏం తింటారండీ బాబూ.. ? అగర్వాల్ ఇంత అందంగా ఉంటారు ఏంటీ  అని అడిగాడు.

అందుకు నిధి వెటకారంగా రియాక్ట్ అయ్యింది. నెయ్యితో అన్నం, పప్పు, అలాగే పచ్చడి తింటాను అంటూ ఫన్నీగా కామెంట్స్ చేసింది నిధి.

అలాగే రాజాసాబ్ సినిమాలో నటించడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. పవన్ గురించి ఒక్క మాటలో చెప్పలేనని.. ఆయన కళ్లకు తాను ఫ్యాన్ అంట.

ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ ట్రూ డార్లింగ్, కైండ్, రియల్ టాలెంటెడ్.. చాలా హంబుల్, అద్భుతమైన వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్టు అందుకున్న నిధి.. ఇటీవల పవన్ జోడిగా హరి హర వీరమల్లు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.