సల్మాన్‌తో ఛాన్స్.. రూ.10 కోట్లు డిమాంట్ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్
Rajitha Chanti
Pic credit - Instagram
04 April 2026
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రంలో సల్మాన్ ఖాన్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానుంది.
అయితే వంశీ పైడిపల్లి చిత్రంలో నయనతారను కథానాయికగా ఎంపిక చేశారు. సల్మాన్ చిత్రంలో నటించినందుకు నయనతారకు రూ. 10 కోట్లు పారితోషికం ఇవ్వనున్నారట.
ఆ పది కోట్ల రూపాయల విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 2023లో అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నయనతార.
ఇందులో నర్మద పాత్ర పోషించడానికి నయనతార రూ.10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. తన మొదటి బాలీవుడ్ చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది నయన్.
ఇప్పుడు తన రెండవ చిత్రంలో కూడా అంతే పారితోషికం తీసుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఆమెకు, సల్మాన్ ఖాన్‌కు మధ్య ఉన్న వయసు వ్యత్యాసం గురించి కూడా చర్చ జరుగుతోంది.
సల్మాన్ ఖాన్, నయనతారల మధ్య 19 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. దీంతో ఇప్పుడు వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
ఇటీవలే మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో మరోసారి మెప్పించింది.
ప్రస్తుతం నయనతార తెలుగు, తమిళం భాషలలో వరుస చిత్రాల్లో నటిస్తుంది. అలాగే ఇప్పుడిప్పుడే హిందీలో వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ బిజీ అవుతుంది.