AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trivikram Srinivas: ఆ సినిమా ఒక గొప్ప అద్భుతం.. అందుకే నాకు ఎంతో ఇష్టమైన మూవీ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కామెంట్స్..

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన తీసే సినిమాలు, రాసే డైలాగ్స్ ప్రతి ప్రేక్షకుడిని కదిలిస్తాయి. చివరగా గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్.. ప్రస్తుతం వెంకటేశ్ హీరోగా ఆదర్శ కుటుంబం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై ప్రస్తుతం మంచి ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో గతంలో త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి.

Trivikram Srinivas: ఆ సినిమా ఒక గొప్ప అద్భుతం.. అందుకే నాకు ఎంతో ఇష్టమైన మూవీ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కామెంట్స్..
Trivikram
Rajitha Chanti
|

Updated on: Apr 04, 2026 | 8:14 AM

Share

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో ఓ ఇంటర్వ్యూలో సాగర సంగమం చిత్రాన్ని తనకు ఇష్టమైన సినిమా అని వెల్లడించారు. ఈ చిత్రం తెలుగు సినిమాకు ఒక నిస్సందేహమైన క్లాసిక్ అని అన్నారు. తెలుగు సినిమా చరిత్రలో మాయా బజార్, లవకుశ, శంకరాభరణం వంటి కొన్ని ఐకానిక్ చిత్రాలతో పాటు సాగర సంగమం కూడా కీలకమైన స్థానాన్ని కలిగి ఉందని, వీటిని ప్రస్తావించకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడటం అసాధ్యమని చెప్పుకొచ్చారు. సాగర సంగమం కేవలం వాణిజ్యపరంగా విజయం సాధించడం వల్లనో లేదా ఎక్కువ రోజులు ప్రదర్శించబడటం వల్లనో గొప్ప చిత్రం కాలేదని త్రివిక్రమ్ వివరించారు. సినిమాను తీసే విధానాన్ని, చూసే విధానాన్ని సమూలంగా మార్చిన అతికొద్ది చిత్రాలలో ఇది ఒకటని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా ప్రేక్షకులతో పాటు దర్శకులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్ల ఆలోచనా విధానాలను కూడా ప్రభావితం చేసిందని తెలిపారు. ఇటువంటి ప్రభావవంతమైన చిత్రాలు ప్రతి పది, పదిహేనేళ్ళకు ఒకసారి మాత్రమే వస్తాయని, అయితే కే. విశ్వనాథ్ వంటి దర్శకులు అలాంటి పది చిత్రాలను అందించడం ఒక అరుదైన రికార్డు అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : ఆమెను అలా చూసి తట్టుకోలేకపోయాను.. సౌందర్య గురించి ప్రేమ చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..

జీవితకాలంలో ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే అలాంటివి తీయగలరని, కానీ పది సినిమాలు తీయడం 150 సంవత్సరాలకు సరిపడా సినిమా వారసత్వాన్ని అందించినట్లేనని ఆయన అన్నారు. సాగర సంగమం తనకెందుకు ఇష్టమో వివరిస్తూ, ఈ సినిమా ఒక వైఫల్య గాథను అద్భుతమైన విజయవంతమైన రీతిలో ఆవిష్కరించిందని త్రివిక్రమ్ తెలిపారు. సాధారణంగా ప్రేక్షకులు విజయ గాథలను చూడటానికి ఆసక్తి చూపుతారని, కానీ ఒక వైఫల్యాన్ని ఇంత శక్తివంతంగా చూపించడం చాలా అరుదైన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. బాలూ అనే పాత్ర జీవితాంతం నృత్యం కోరుకున్నా అది అతనికి దక్కదని, సినిమా ప్రారంభం నుంచే అతని వైఫల్యం స్పష్టంగా చూపబడుతుందని త్రివిక్రమ్ వివరించారు. సినిమా ఆరంభంలోనే, తాగి రోడ్డుపై పడిపోయిన బాలూ కృష్ణుడి పాదాలను కూడా నేను అందులో నడవను అని చెప్పే సన్నివేశం అతని నిరాశను తెలియజేస్తుందని తెలిపారు. సిటిజన్ కేన్ చిత్రంతో ఈ సినిమాను పోల్చుతూ, జీవితాంతం కోరుకున్నది దక్కని కథానాయకుడి ప్రయాణం ఎలా ఉంటుందో సాగర సంగమం చక్కగా చూపుతుందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 62 ఏళ్లలో 2500కు పైగా సినిమాలు.. మహేష్ బాబు సినిమాతో ఫేమస్.. ఈ నటి ఎవరో గుర్తుపట్టారా.. ?

ఈ చిత్రం కేవలం ఒక భావోద్వేగ ప్రయాణం మాత్రమే కాదని, జీవితంలోని హాస్యం, విషాదం రెండింటినీ మిళితం చేస్తుందని త్రివిక్రమ్ పేర్కొన్నారు. “ఎండావాన లాగా నవ్వించి, నవ్వించి, నవ్వించి ఏడిపిస్తారు,” అని అన్నారు. సినిమాలోని భంగిమ వంటి మ్యానరిజమ్స్ ఎంతగా ప్రాచుర్యం పొందాయో వివరిస్తూ, ఈ పదం నేటికీ సామాజిక మాధ్యమాలలో, రోజువారీ సంభాషణలలో తరచుగా ఉపయోగించబడుతోందని, ఫోటోలు తీసేటప్పుడు సరైన భంగిమ లేకపోతే వ్యాఖ్యలు వస్తాయని అన్నారు. శంకరాభరణం, సిరిసిరిమువ్వ, సీతామహాలక్ష్మి, శివ సంకల్పం, సిరివెన్నెల, స్వాతికిరణం వంటి ఇతర గొప్ప చిత్రాలు ఉన్నప్పటికీ, సాగర సంగమం వైఫల్యాన్ని విజయవంతంగా చెప్పిన తీరు తనను ఎక్కువగా ఆకట్టుకుందని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma : ప్రపంచంలోని అన్నిటికంటే ఆ పాటే గొప్ప సాంగ్.. బతుకునే మార్చే పాట ఇది.. రామ్ గోపాల్ వర్మ..

ఎక్కువ మంది చదివినవి : Aamani: ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. ఆ హీరో మాట్లాడే తీరు సూపర్ ఉంటుంది.. హీరోయిన్ ఆమని..

Follow Us