AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తిన్నారా.. కరివేపాకు వీరికి యమడేంజర్.. తింటే ఈ సమస్యలు కొనితెచ్చుకున్నట్లే..

మన వంటకాల్లో సువాసన, రుచి కోసమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాల కోసం కరివేపాకును విరివిగా వాడుతుంటారు. జుట్టు రాలడం తగ్గించడానికి, కంటి చూపు, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉదయాన్నే పచ్చి కరివేపాకు నమలడం లేదా రసం తాగడం చాలామందికి అలవాటు. అయితే సాధారణ వ్యక్తులకు మేలు చేసే ఈ కరివేపాకు, కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Krishna S
|

Updated on: Oct 13, 2026 | 5:47 PM

Share
కిడ్నీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి కరివేపాకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఇందులో ఉండే అధిక పొటాషియం, ఆక్సలేట్లు మూత్రపిండాల రోగుల్లో గుండె స్పందన రేటు అకస్మాత్తుగా పెరిగిపోయేలా చేసి ప్రాణాపాయ స్థితికి దారితీయవచ్చు. ముఖ్యంగా కాల్షియం ఆక్సలేట్ కిడ్నీ రాళ్లు ఉన్నవారు కరివేపాకు రసం లేదా పొడిని నిత్యం అధికంగా తీసుకుంటే రాళ్ల పరిమాణం మరింత పెరిగే ముప్పు ఉంటుంది.

1 / 5
రక్తపోటు, మధుమేహం సమస్యలతో బాధపడేవారు కూడా కరివేపాకు విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఇది రక్తపోటును తగ్గించే గుణం కలిగి ఉండటంతో.. లో బీపీ ఉన్నవారు లేదా బీపీ మాత్రలు వాడేవారు అధికంగా తీసుకుంటే రక్తపోటు ఒక్కసారిగా పడిపోయి కళ్లు తిరగడం, స్పృహ కోల్పోవడం వంటివి జరుగుతాయి. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు ఇన్సులిన్ లేదా డయాబెటిస్ మందులు వాడుతూ దీనిని మోతాదుకు మించి తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ తీవ్రంగా పడిపోయి హైపోగ్లైసీమియాకు దారితీసి గుండె, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

2 / 5
రక్తాన్ని పల్చబరిచే ఆస్పిరిన్, వార్ఫరిన్ వంటి మందులు వాడేవారికి, శస్త్రచికిత్సలకు సిద్ధమవుతున్న వారికి కరివేపాకు మరింత ప్రమాదకరం. కరివేపాకులోని విటమిన్ కె, రక్తాన్ని పలచబరిచే సహజ గుణాలు ఈ ఔషధాల పనితీరును తారుమారు చేసి అంతర్గత రక్తస్రావానికి కారణమవుతాయి. అందువల్ల సర్జరీలకు కనీసం రెండు వారాల ముందే కరివేపాకును అధిక మోతాదులో తీసుకోవడం పూర్తిగా నిలిపివేయాలి.

3 / 5
అధిక ఎసిడిటీ, గ్యాస్ సమస్యలతో ఇబ్బందిపడేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి కరివేపాకు తింటే తీవ్రమైన గుండెల్లో మంట, వికారం, అజీర్ణం వంటి లక్షణాలు ఎదురవుతాయి. మరోవైపు గర్భిణులు వంటల్లో కొద్దిగా వాడుకోవడం క్షేమకరమే అయినప్పటికీ.. కరివేపాకు కషాయాలు లేదా రసాలను అధిక మోతాదులో తాగడం గర్భాశయ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

4 / 5
ఆయుర్వేద పరంగా చూసినా మితంగా తీసుకుంటేనే ఏ మూలికైనా ఔషధంగా పనిచేస్తుంది. అమితమైతే విషంగా మారుతుంది. సాధారణ వ్యక్తులు రోజువారీ వంటల్లో 5 నుంచి 10 ఆకులను తీసుకోవడం ఉత్తమం. కానీ కిడ్నీ, బీపీ, షుగర్, రక్తం పలచబడే సమస్యలు ఉన్నవారు కరివేపాకును కేవలం ఔషధంగా లేదా రసాల రూపంలో వాడే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
Follow Us
పాపికొండల విహారయాత్రకు అధికారుల గ్రీన్ సిగ్నల్

ఎలక్ట్రిక్ కారుపై సోలార్ ప్యానెల్స్‌.. ఛార్జింగ్ ఖర్చు తగ్గుతుందా

జ్ఞాపకాల కోసం 112 ఏళ్ల పురాతన ఇంటిని 9 కి.మీ. దూరం తరలించిన మహిళ!

ఎరక్కపోయి ఇరుకున్నాడు.. యూట్యూబ్‌లో చూసి బంగారం కోసం వేట..

రవి, శుక్రుల యుతి..వీరికి కొత్త ఉద్యోగ ఆఫర్లు ఖాయం..!

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్..

ప్రియుడి కోసం భారత్‌కు రష్యా యువతి
ప్రియుడి కోసం భారత్‌కు రష్యా యువతి
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తిన్నారా.. కరివేపాకు వీరికి యమడేంజర్..

8 నెలల కష్టం ఒక్క నెలలోనే వృథా.. మళ్లీ రంగంలోకి బిట్టు తబాహి!

నెటిజన్ అసభ్యకరమైన కామెంట్స్.. కౌంటరిచ్చిన వేణు స్వామి భార్య