AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టినరోజున కేక్ ఎందుకు కట్ చేస్తారు? ఈ సంప్రదాయం ఎలా మొదలైందో తెలుసా!

పుట్టినరోజు వచ్చిందంటే చాలు కేక్ కట్ చేయడం, కొవ్వొత్తులు ఆర్పడం, విషెస్ చెప్పుకోవడం నేడు ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ వేడుకగా మారిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తమ ప్రత్యేక రోజును కేక్ కటింగ్‌తోనే ఆరంభిస్తున్నారు. అయితే, ఈ సంప్రదాయం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు మొదలైందనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. దీని వెనుక ప్రాచీన విశ్వాసాలు, చారిత్రక పరిణామాలు దాగి ఉన్నాయి.అవేంటో వివరంగా తెలుసుకుందాం..

పుట్టినరోజున కేక్ ఎందుకు కట్ చేస్తారు? ఈ సంప్రదాయం ఎలా మొదలైందో తెలుసా!
Birthday Cake Tradition
Jyothi Gadda
|

Updated on: Nov 23, 2026 | 12:01 PM

Share

పుట్టినరోజున కేక్ కట్ చేసి కొవ్వొత్తులు ఆర్పే సంప్రదాయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. నేడు కేక్ కట్ చేయడం ఆనందం, ఆత్మీయత, కొత్త సంవత్సర ఆరంభానికి ప్రతీకగా మారింది. ప్రాచీన గ్రీకులు చంద్రదేవత ఆర్టెమిస్‌కు గుండ్రని కేకులు సమర్పించి వాటిపై కొవ్వొత్తులు వెలిగించేవారు. ఆ తర్వాత 18వ శతాబ్దం చివర్లో జర్మనీలో పిల్లల పుట్టినరోజులను కిండర్‌ఫెస్ట్ పేరుతో ఘనంగా నిర్వహించేవారు.ఉదయం కేక్‌పై కొవ్వొత్తులు వెలిగించి, సాయంత్రం వాటిని ఆర్పే ఆచారం అక్కడి నుంచే మొదలైంది. ఇంతకీ ఈ సాంప్రదాయం వెనుక అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం..

ప్రాచీన గ్రీకు ఆచారాలతో ముడిపడిన మూలాలు

చరిత్రకారుల ప్రకారం, పుట్టినరోజు కేక్ సంప్రదాయానికి మూలాలు ప్రాచీన గ్రీస్‌లో కనిపిస్తాయి. గ్రీకులు తమ చంద్రదేవత అయిన ఆర్టెమిస్‌కు గుండ్రని ఆకారంలో ఉన్న తీపి పదార్థాలు, కేకులు సమర్పించేవారు. వాటిపై వెలిగించే కొవ్వొత్తులు చంద్రుని కాంతిని ప్రతిబింబిస్తాయని విశ్వసించేవారు. పొగ పైకి వెళితే తమ కోరికలు, ప్రార్థనలు దేవతకు చేరుతాయని వారు నమ్మేవారు.

జర్మనీ కిండర్‌ఫెస్ట్ వేడుకలు

ఆధునిక పుట్టినరోజు కేక్ రూపానికి 18వ శతాబ్దం చివర్లో జర్మనీలో జరిగిన కిండర్‌ఫెస్ట్ వేడుకలు బలమైన పునాది వేశాయి. పిల్లల పుట్టినరోజులను ప్రత్యేకంగా జరుపుకోవడానికి ఉదయం వేళ కేక్‌పై కొవ్వొత్తులు వెలిగించేవారు. ఆ కొవ్వొత్తులు రోజంతా కరిగిపోతుండగా, సాయంత్రం వేళ వాటిని ఒక్కసారిగా ఊది ఆర్పేవారు. ఈ క్రమంలో ఒక కోరిక కోరుకునే ఆచారం క్రమంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

సామాన్యులకు చేరువైన కేక్‌లు

పాత రోజుల్లో చక్కెర, శుద్ధి చేసిన పిండి, బేకింగ్ పదార్థాలు ఖరీదైనవిగా ఉండేవి. కాబట్టి కేక్‌లు కేవలం సంపన్నుల వేడుకలకే పరిమితమయ్యాయి. 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం తర్వాత బేకరీ ఉత్పత్తులు, ముడిసరుకులు సులభంగా, తక్కువ ధరకే లభించడంతో పుట్టినరోజు కేక్‌లు సాధారణ ప్రజల ఇళ్లకూ చేరాయి.

నేటి అర్థం

కాలక్రమేణా మతపరమైన, మూఢనమ్మకాల కోణాలు పక్కకు తప్పుకుని, కేక్ కట్ చేయడం స్నేహం, ఆనందం, కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతను పంచుకునే సంతోషకరమైన వేడుకగా స్థిరపడింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us
2 ఉల్లిపాయలు, 2 బంగాళదుంపలు ఉంటే చాలు.. కరకరలాడే ప్యాటీలు రెడీ
2 ఉల్లిపాయలు, 2 బంగాళదుంపలు ఉంటే చాలు.. కరకరలాడే ప్యాటీలు రెడీ
పుట్టినరోజున కేక్ ఎందుకు కట్ చేస్తారు? ఈ సంప్రదాయం ఎలా మొదలైందంటే
పుట్టినరోజున కేక్ ఎందుకు కట్ చేస్తారు? ఈ సంప్రదాయం ఎలా మొదలైందంటే
ఈ పోషకాల ఖజానాను ఎప్పుడైనా తినొచ్చు..
ఈ పోషకాల ఖజానాను ఎప్పుడైనా తినొచ్చు..
శ్రీదేవి కాదు ఆమెనే నేను పిచ్చి పిచ్చిగా ప్రేమించా..
శ్రీదేవి కాదు ఆమెనే నేను పిచ్చి పిచ్చిగా ప్రేమించా..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతాయి?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతాయి?
2 ఉల్లిపాయలతో అదిరిపోయే పచ్చడి.. వేడి అన్నంలో తింటే అదిరిపోద్ది!
2 ఉల్లిపాయలతో అదిరిపోయే పచ్చడి.. వేడి అన్నంలో తింటే అదిరిపోద్ది!
రివేంజ్ గేమ్‌కు రెడీ.. మరోసారి తలపడనున్న భారత్ vs పాకిస్థాన్
రివేంజ్ గేమ్‌కు రెడీ.. మరోసారి తలపడనున్న భారత్ vs పాకిస్థాన్
ట్యూబ్ టైర్ vs ట్యూబ్‌లెస్ టైర్: మీ వాహనానికి ఏది బెటర్‌? తేడాలు
ట్యూబ్ టైర్ vs ట్యూబ్‌లెస్ టైర్: మీ వాహనానికి ఏది బెటర్‌? తేడాలు
కళ్యాణ్ రామ్ భార్య గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
కళ్యాణ్ రామ్ భార్య గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి గుండెను కాపాడే ఛూమంత్రం..
కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి గుండెను కాపాడే ఛూమంత్రం..