AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV: శ్రీదేవి కాదు ఆమెనే నేన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కాలేజ్ రోజుల నుంచే

ఒకప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి తనదైన ముద్ర వేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు చిత్రాలు తగ్గించిన ఆయన.. నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆర్జీవీ చెప్పే మాటలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.

RGV: శ్రీదేవి కాదు ఆమెనే నేన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కాలేజ్ రోజుల నుంచే
Rgv
Rajeev Rayala
|

Updated on: Nov 23, 2026 | 11:49 AM

Share

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితంలో ప్రేమించిన వారి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను చాలా మందిని ప్రేమించానని, పెళ్లికి ముందు, తర్వాత కూడా ప్రేమించిన సందర్భాలున్నాయని తెలిపారు. ఈ ప్రయాణంలో తనకు గుర్తిండిపోయిన సంఘటనలను పంచుకున్నారు. కాలేజీ రోజుల్లో సత్య అనే అమ్మాయిని ప్రేమించినట్లు ఆర్జీవీ గుర్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో మెడికల్ కళాశాల తాత్కాలికంగా ఉన్న రోజుల్లో, అందరికన్నా అందంగా ఉండే సత్య అనే అమ్మాయిని చూసి తను ఆకర్షితుడయ్యారు. ఆమె కార్లో కళాశాల ప్రాంగణంలోకి రాగానే తన హృదయంలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వినిపించేదని సరదాగా అన్నారు. అయితే, ఆమె అందం, హోదా ముందు తను పనికిరాననే భావనతో ఆమెను కేవలం ఆరాధించేవాడినని, ప్రపోజ్ చేయాలనే ఆలోచన రాలేదని చెప్పారు. ఆమె తన స్నేహితుడు కైజర్‌తో ప్రేమలో ఉందని తను భావించానన్నారు. చాలా సంవత్సరాల తర్వాత, తన పెళ్లయ్యాక ఆమెకు తనంటే ఇష్టమనే విషయం తెలిసిందని, దీన్ని “ఎక్కవలసిన రైలు జీవిత కాలం లేట్” అయినట్లుగా అభివర్ణించారు. శ్రీదేవి విషయంలోనూ ఇలాగే జరిగిందని, తాను నిజంగా ప్రేమించిన అమ్మాయిలందరినీ ఇలాగే పోగొట్టుకున్నానని వర్మ అన్నారు.

అయితే, తన జీవితంలో అతి పెద్ద ఆరాధన జయసుధపై దాదాపు పదేళ్ల పాటు సాగిందని రామ్ గోపాల్ వర్మ వివరించారు. కాలేజీ రోజుల్లోనే జయసుధ అంటే తనకు పిచ్చి అబ్సెషన్ అని, జ్యోతి సినిమా వాల్ పోస్టర్‌ను రోడ్డుపై నిలబడి గంటల తరబడి చూసేవాడినని తెలిపారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తిరుగుతున్న రోజుల్లో ఈ అభిమానం మరింత పెరిగిందని చెప్పారు. మూడో సంవత్సరం ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడు విడుదలైన అమరదీపం చిత్రాన్ని కాకినాడలోని రామ్ ప్రియ థియేటర్‌లో ఏడుసార్లు చూశానని వర్మ వెల్లడించారు. జయసుధ ఒక పాటలో కనిపించే మూడు సెకన్ల క్లోజప్ షాట్ కోసం మాత్రమే తను ఆ సినిమాను ఇన్నిసార్లు చూశానని, మిగతా సినిమాతో తనకు సంబంధం లేదని చెప్పారు.

అయితే, తన ఆరాధనకు తెరదించిన సంఘటనలను కూడా ఆర్జీవీ పంచుకున్నారు. ఒకసారి శ్రీవారి ముచ్చట్లు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, జయసుధ ఆవలించడం చూసి, ఒక సినిమా స్టార్ కూడా మనిషిలా సాధారణంగా ఆవలిస్తుందని తను తట్టుకోలేకపోయానని, నిరాశ చెందానని తెలిపారు. ఆ తర్వాత, రావు గారి ఇంట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు జయసుధకు సీన్ పేపర్ ఇచ్చే అవకాశం వచ్చిందని చెప్పారు. రాత్రంతా కష్టపడి, తన బ్యాడ్ హ్యాండ్‌రైటింగ్‌తో తెలుగులో సీన్ రాసి, ఆమె కూర్చుని ఉండగా వెళ్లి ఇచ్చానన్నారు. “ఆవిడ నా సీన్ చదివి ఇంప్రెస్ అయిపోయి, ఎవరు రాశారు? అని అడుగుతుందని, అప్పుడు నేనే అని చెప్పాలని” తను ఊహించుకున్నానని వర్మ తెలిపారు. కానీ, జయసుధ పేపర్‌ను చూసి, “ఎన్ని పేజీలు?” అని అడిగి, “నాకు ఉట్టి షాట్స్ చెప్తే చాలు, ఇంత పెద్ద సీన్ చదివే ఓపిక లేదు” అని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటనతో తన ప్రేమ, ఆరాధనపై వేడి నీళ్లు పడినట్లు అయ్యిందని, దానితో తన లవ్ స్టోరీకి ఫుల్‌స్టాప్ పెట్టేశానని రామ్ గోపాల్ వర్మ వివరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శ్రీదేవి కాదు ఆమెనే నేన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించా..
శ్రీదేవి కాదు ఆమెనే నేన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించా..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతాయి?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతాయి?
2 ఉల్లిపాయలతో అదిరిపోయే పచ్చడి.. వేడి అన్నంలో తింటే అదిరిపోద్ది!
2 ఉల్లిపాయలతో అదిరిపోయే పచ్చడి.. వేడి అన్నంలో తింటే అదిరిపోద్ది!
రివేంజ్ గేమ్‌కు రెడీ.. మరోసారి తలపడనున్న భారత్ vs పాకిస్థాన్
రివేంజ్ గేమ్‌కు రెడీ.. మరోసారి తలపడనున్న భారత్ vs పాకిస్థాన్
ట్యూబ్ టైర్ vs ట్యూబ్‌లెస్ టైర్: మీ వాహనానికి ఏది బెటర్‌? తేడాలు
ట్యూబ్ టైర్ vs ట్యూబ్‌లెస్ టైర్: మీ వాహనానికి ఏది బెటర్‌? తేడాలు
కళ్యాణ్ రామ్ భార్య గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
కళ్యాణ్ రామ్ భార్య గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి గుండెను కాపాడే ఛూమంత్రం..
కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి గుండెను కాపాడే ఛూమంత్రం..
డిసెంబర్ 3న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. అలర్ట్..
డిసెంబర్ 3న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. అలర్ట్..
ఫోన్ రిపేర్ కోసం మహిళ.. ఫొటోలపై కన్నేశాడు! అమెరికాలో అరెస్ట్
ఫోన్ రిపేర్ కోసం మహిళ.. ఫొటోలపై కన్నేశాడు! అమెరికాలో అరెస్ట్
క్రమశిక్షణతోనే విజయం.. చదువుపై ఏకాగ్రత పెరగాలంటే ఈ 4 చేయండి
క్రమశిక్షణతోనే విజయం.. చదువుపై ఏకాగ్రత పెరగాలంటే ఈ 4 చేయండి