నా జీవితమే క్రష్ అయిపోయింది.. మీనాక్షి చౌదరి అంతమాట అనేసిందేంటీ..!
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి. ఈ అమ్మడు ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమాలతో యమా బిజీ అయ్యింది ఈ వయ్యారి భామ మొన్నటి వరకు మీనాక్షికి చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. కానీ ఇప్పుడు క్యూ కడుతున్నాయి.

టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉన్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. అందం, అభినయంతో పాటు తనదైన కామెడీ టైమింగ్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు తన సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరసన ‘వృషకర్మ’ సినిమాలో నటిస్తున్న మీనాక్షి.. తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని సరదా విషయాలను వెల్లడించారు. ప్రేమ, క్రష్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా సినీ సెలబ్రిటీల ఇంటర్వ్యూలలో ప్రేమ, పెళ్లి, క్రష్ వంటి ప్రశ్నలు ఎదురవుతుంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరికి కూడా ఇలాంటి ప్రశ్నే ఎదురైంది.
ప్రస్తుతం ఎవరిపైనైనా క్రష్ ఉందా? అని యాంకర్ అడగ్గా.. ఆమె ఇచ్చిన సమాధానం అందరినీ నవ్వించింది. తనకు ప్రస్తుతం ఎవరిపైనా క్రష్ లేదని చెబుతూనే.. తన జీవితమే క్రష్ అయిపోయిందనే అర్థం వచ్చేలా సరదాగా స్పందించారు. దీంతో ఆమె సమాధానం ఇంటర్వ్యూలో నవ్వులు పూయించింది. ఇక ప్రేమ, రిలేషన్‌షిప్స్ గురించి కూడా మీనాక్షి ఆసక్తికరమైన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రేమలో పడటం ఎంతటి భావోద్వేగంతో కూడుకున్న విషయమో.. ఒక బంధం నుంచి బయటకు రావడం కూడా అంతే కష్టమని ఆమె అభిప్రాయపడ్డారు. బ్రేకప్ అనేది అంత సులభమైన విషయం కాదని, అలాంటి అనుభవాలు మనసుపై ప్రభావం చూపిస్తాయని ఆమె వ్యాఖ్యల సారాంశం. అయితే తన వ్యక్తిగత ప్రేమ జీవితంపై ఎలాంటి వివరాలను వెల్లడించకుండా సరదాగా సమాధానాలు ఇవ్వడం విశేషం.
మీనాక్షి చౌదరి ప్రస్తుతం సినిమాల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తన స్థానాన్ని మరింత బలపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. ఇప్పుడు నాగచైతన్యతో కలిసి ‘వృషకర్మ’లో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
