AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనిరుధ్-కావ్యా మారన్‌ రిసెప్షన్‌లో ధోని సందడి.. ఫోటోలు వైరల్..!

Anirudh Kavya Maran Reception: సంగీత దర్శకుడు అనిరుధ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ వెడ్డింగ్ రిసెప్షన్ రెండో రోజు ఘనంగా జరిగింది. ఎంఎస్ ధోనీ సతీసమేతంగా హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. అజిత్, రజనీకాంత్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Venkata Chari
|

Updated on: Nov 22, 2026 | 10:02 PM

Share
Anirudh Kavya Maran Reception: సంగీత దర్శకుడు అనిరుధ్, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్యా మారన్ వివాహ రిసెప్షన్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. నవంబర్ 22, 2026న రెండో రోజు వేడుక జరగగా.. సినీ, క్రికెట్ ప్రముఖులు సందడి చేశారు.

1 / 6
ఈ వేడుకకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షితో కలిసి హాజరయ్యారు. నూతన జంట అనిరుధ్-కావ్యా మారన్‌ను ప్రత్యక్షంగా ఆశీర్వదించారు. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోనీ తొలిసారి ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొనడం విశేషంగా నిలిచింది.

2 / 6
ఈ వేడుకలోనే నటుడు అజిత్ కుమార్ కూడా పాల్గొన్నారు. దీంతో ‘రెట్ట తల’ అంటూ ఎంఎస్ ధోనీ, అజిత్ ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. తల ధోనీ, తల అజిత్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

3 / 6
అంతకుముందు అనిరుధ్ బంధువు, సూపర్ స్టార్ రజనీకాంత్ వేడుకకు హాజరయ్యారు. వేదిక వద్దకు వచ్చిన అజిత్ కుమార్‌ను రజనీకాంత్ ఆలింగనం చేసుకుని స్వాగతించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

4 / 6
నవంబర్ 21న జరిగిన మొదటి రోజు రిసెప్షన్‌కు రాజకీయ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి విజయ్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, పీఎంకే నేత అన్బుమణి రామదాస్, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ హాజరయ్యారు.

5 / 6
వీరితో పాటు కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తదితరులు నూతన జంటను ఆశీర్వదించారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ వివాహ వేడుక కోలీవుడ్, క్రికెట్, రాజకీయ వర్గాల సమ్మేళనంగా మారింది.

6 / 6
Follow Us
అనిరుధ్-కావ్యా మారన్‌ రిసెప్షన్‌లో ధోని సందడి..

అరటికాయ వేపుడు ఒక్కసారి ఇలా చేశారంటే ఎప్పుడూ ఇదే చేసుకుంటారు

తెలంగాణలో బీజేపీ దూకుడు.. 3 రోజుల్లో ముగ్గురు అగ్రనేతల పర్యటనలు..

మీ ఇంటి కిచెన్ లో ఉండే ఈ ముక్కలను ముఖం మీద రుద్దితే మెరిసిపోతుంది

రష్మిక ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..'మైసా' విడుదల వాయిదా.. కారణమిదే

హైదరాబాద్‌లో హై అలర్ట్.. కాచిగూడకు ఉగ్రవాదుల బెదిరింపు

నోట్లో వేస్తే కరిగిపోయేలా.. సుతిమెత్తని రవ్వ లడ్డు పక్కా కొలతలతో

ఓల్డ్ బైక్స్‌కు మళ్లీ ఫుల్ క్రేజ్.. కొత్త బైక్‌లను మించిన డిమాండ్

ఆడవాళ్లు vs మగవాళ్లు.. ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్తారు..?

ఈ ఒక్కటి వేస్తే చాలు.. ఒక్క గులాబీ మొక్కకు 100 పైగా మొగ్గలు పక్కా