September 14, 2026
venkata chari
భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మైదానంలో తన దూకుడైన ఆటతీరుతో సంచలనం సృష్టిస్తూనే, వ్యాపార ప్రకటనల ప్రపంచంలోనూ భారీ డిమాండ్ సొంతం చేసుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League - IPL) లో అద్భుత ప్రదర్శన తర్వాత అతడి బ్రాండ్ విలువ అనూహ్యంగా పెరిగింది.
హౌలిహాన్ లోకే ఐపీఎల్ వాల్యుయేషన్ స్టడీ 2026 నివేదిక ప్రకారం, ఈ 15 ఏళ్ల క్రికెటర్ రోజువారీ బ్రాండ్ షూట్ లేదా ప్రచార కార్యక్రమాల కోసం సుమారు రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడు.
ఎంతో అనుభవజ్ఞులైన అంతర్జాతీయ ఆటగాళ్లకు మాత్రమే లభించే స్థాయిలో ఈ టీనేజ్ ప్లేయర్‌కు పారితోషికం దక్కడం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఐపీఎల్ వరుస సీజన్లలో ప్రదర్శించిన అసాధారణ ఫామ్ కారణంగా ఈ భారీ పారితోషికాన్ని అందుకుంటున్నట్లు ఏఎంపీ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థాపకుడు ఇంద్రనీల్ దాస్ బ్లాహ్ వెల్లడించారు.
రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ ఫీజు రోజుకు రూ. 3 నుంచి 4 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
13 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టు ద్వారా లీగ్‌లోకి అడుగుపెట్టిన వైభవ్, 2025 సీజన్ అరంగేట్రంలో 7 మ్యాచ్‌లలోనే 206 స్ట్రైక్ రేట్‌తో సెంచరీ సహా 252 పరుగులు చేశాడు.
దూకుడైన శైలి, నిర్భయంగా బ్యాటింగ్ చేసే విధానం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అనంతరం 2026 ఐపీఎల్ సీజన్‌లో 237.31 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు.
ఫలితంగా భారత జాతీయ జట్టు (Team India) తరపున టీ20 అరంగేట్రం చేసి 6 మ్యాచ్‌లలో 193 పరుగులు జోడించాడు. ప్రస్తుతం కస్టమర్లను ఆకర్షించేందుకు కార్పొరేట్ దిగ్గజాలు అతడి బ్రాండ్ ఇమేజ్ వైపు చూస్తున్నాయి.
నేరేడు పండ్లు రుచితో పాటు విటమిన్లు, మినరల్స్, ఔషధ గుణాలు ఉన్న పండ్లు. అయితే, డయాబెటిస్, మలబద్ధకం, జీర్ణ సమస్యలు, అలర్జీలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.