August 25, 2026
Subhash
మన ఇళ్లలో టీవీ, ఏసీ, ఫ్యాన్‌లకు రిమోట్లు ఉంటాయి. అయితే వాటి రంగులు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. ముఖ్యంగా టీవీ రిమోట్ నలుపు, ఏసీ రిమోట్ తెలుపు రంగులో ఉండటం గమనించారా?
ఎలక్ట్రానిక్ పరికరాల డిజైన్‌కు కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నట్లే.. వాటి రిమోట్ల రంగుల ఎంపిక వెనుక కూడా కొన్ని కారణాలు ఉన్నాయని చెబుతారు.
ఏసీ రిమోట్ సాధారణంగా తెలుపు రంగులో ఉంటుంది. గోడకు అమర్చే ఏసీ ఇండోర్ యూనిట్ కూడా ఎక్కువగా తెలుపు రంగులోనే ఉంటుంది. దీంతో మొత్తం ఏసీ సెట్ ఒకే విధమైన లుక్‌లో కనిపిస్తుంది.
ఏసీని సాధారణంగా బెడ్‌రూమ్‌లు, ఆఫీసుల్లో ఉపయోగిస్తారు. తెలుపు రంగు ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించే రంగుగా భావిస్తారు. అందుకే ఏసీతో పాటు రిమోట్‌కు కూడా ఈ రంగును ఎంచుకుంటారు.
తెలుపు రంగు వేడిని ఇతర ముదురు రంగులతో పోలిస్తే తక్కువగా గ్రహిస్తుంది. ఏసీ రిమోట్ తెలుపు రంగులో ఉండటానికి ఇది కూడా ఒక కారణం కావచ్చని కథనం పేర్కొంటోంది.
టీవీ రిమోట్‌ను ఇంట్లో కుటుంబ సభ్యులంతా తరచుగా ఉపయోగిస్తుంటారు. రోజులో చాలాసార్లు చేతిలోకి తీసుకునే వస్తువు కావడంతో త్వరగా మురికిగా మారే అవకాశం ఉంటుంది.
టీవీ రిమోట్‌ను నలుపు రంగులో ఉంచడం వల్ల తరచుగా ఉపయోగించినా మరకలు, మురికి అంత సులభంగా కనిపించవు. అందుకే టీవీ రిమోట్లలో నలుపు రంగు ఎక్కువగా కనిపిస్తుందని కథనం చెబుతోంది.
వీ, ఏసీ రిమోట్ల రంగులు కేవలం డిజైన్ కోసం మాత్రమే కాకుండా.. వాటి వినియోగం, పరిసరాలకు సరిపోయేలా ఉండటం, మురికి కనిపించకుండా ఉండటం వంటివి దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేస్తారట.