05 October, 2025
Subhash
ఎయిర్ కండిషనర్లకు ఎటువంటి నిర్ణీత గడువు తేదీ ఉండదని గుర్తించుకోండి. వాడినకొద్ది ఏసీ కూలింగ్, పని సామర్థ్యం తగ్గుతుంది. కానీ గడువు ఉండదు.
పాత ఏసీ ఎక్కువ విద్యుత్ వినియోగిస్తుంది. అప్పుడప్పుడు రిపేరు వస్తుంటుంది. సగటున ఒక ఎయిర్ కండిషనర్ 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది.
ఏసీని సరిగ్గా వాడినట్లయితే స్ప్లిట్ ఏసీ 15 సంవత్సరాల వరకు ఉంటుంది. విండో ఏసీ సాధారణంగా 8 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది.
ఏసీ పదే పదే రిపేరు వస్తుంటే దాన్ని మార్చాలని గుర్తించుకోండి. ఏసీ మునుపటిలా కూలింగ్ కాకపోతే కొత్త ఏసీ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
పాత ఏసీలు ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి. దీనివల్ల బిల్లు పెరుగుతుంది. AC నుండి వింత శబ్దం వస్తే అది దెబ్బతిన్నదానికి సంకేతం అని గుర్తించుకోండి.
AC నుండి నీరు లేదా రిఫ్రిజెరాంట్ లీక్ అవుతుంటే, వెంటనే దాన్ని రిపేర్ చేయండి. తరచుగా లీకేజీలు వస్తున్నా, కొత్త ఏసీ తీసుకోవడం మంచిది.
10 సంవత్సరాల కంటే పాతబడిన AC పాత టెక్నాలజీకి చెందినది. కొత్త AC తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. ఆధునిక లక్షణాలతో వస్తుంది.
ఇలా ఎయిర్ కండిషనర్‌కు ఎలాంటి గడువు ఉండదు. దాని పనితీరు.. సామర్థ్యం బట్టి మార్చాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించుకోవాలి.