25 March 2025
Subhash
గతంలో నాణేలు సిల్వర్ కలర్‌లో ఉండేవి. ఇప్పుడు రూ.10, రూ.5 కాయిన్లు లైట్ గోల్డ్ కలర్‌లో ఉంటాయి. వీటి తయారీలో రకరకాల లోహాలు కూడా కలుస్తాయి.
ఇక పది రూపాయల నాణెం అయితే కాస్త మధ్యలో సాధారణంగా చుట్టూ బంగారు రంగు బోర్డర్ తో వస్తుంది. ఈ ఎల్లో కలర్ దేనితో తయారు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా..?
మీరు రూ.10 నాణెం చూసి ఉంటారు. ఇది చాలా ప్రత్యేకమైనది. చూసేందుకూ అందంగా ఉంటుంది. మీరు గమనిస్తే రూ.10 నాణెంలో రెండు రంగులు ఉంటాయి. ఇందులో ఒక భాగం పసుపు రంగులో ఉంటుంది.
రూ.10 కాయిన్ లో పసుపు భాగం ఏ లోహంతో తయారు చేసి ఉండవచ్చో మీరెప్పుడైనా ఆలోచించారా? ఇందులో కొన్ని లోహాలు కలుస్తాయి.
రూ.10 నాణెంలోని పసుపు భాగం అల్యూమినియం కాంస్యంతో తయారు చేస్తారు. ఇందులో 92 శాతం రాగి ఉండగా, 6 శాతం అల్యూమినియం ఉంది. అలాగే 2 శాతం నికెల్ ఉన్నాయి.
10 రూపాయల నాణెం బరువు 7.71 గ్రాములు. దీనిలో బయటి వృత్తం బరువు 4.45 గ్రాములు. మధ్య భాగం బరువు 3.26 గ్రాములు.
పది రూపాయల నాణెంలో ఉన్న మధ్య భాగాన్ని కుప్రో నికెల్‌తో తయారు చేస్తారు. రూ.1 నాణెం తయారు చేసేందుకు ప్రభుత్వం రూ.1.11 పైసలు ఖర్చు చేస్తుంది.
రూ.10 నాణెం తయారీకి అయ్యే ఖర్చు రూ.5.54. ఈ విషయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2018లో స్వయంగా వెల్లడించింది.