Blinkit: బ్లింకిట్‌ అంబులెన్స్ సేవలు.. 10 నిమిషాల్లో రోగుల చెంతకు..!

04 January 2025

Subhash

క్విక్‌ ఈ కామర్స్‌ సంస్థ బ్లింకిట్‌ (Blinkit) మరో కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. అంబులెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.

 బ్లింకిట్‌

బ్లింకిట్‌ ఇప్పటికే ఆర్డర్‌ చేసిన పది నిమిషాల్లోనే నిత్యావసర సరకులు, ఇతర వస్తువులు డోర్‌ డెలివరీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అంబులెన్స్‌ సర్వీసెస్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.

బ్లింకిట్‌

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టిన గ్రాసరీస్‌ను 10 ని.. డెలివరీ చేసినట్టుగానే .. 10 ని.. అంబులెన్స్‌ రోగుల చెంతకు వచ్చేలా బ్లింకిట్‌ అంబులెన్స్‌ సేవలను ప్రారంభించింది. 

బ్లింకిట్‌ అంబులెన్స్‌

తొలుత గురుగ్రామ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. బ్లింకిట్‌ యాప్‌లోనే ఈ సేవలు అందుబాటులో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.

గురుగ్రామ్‌

ఈ అంబులెన్సుల్లో ఆక్సిజన్‌ సిలిండర్‌, స్ట్రెచర్‌, మానిటర్‌, అత్యవసర మందులు, ఇంజెక్షన్లు, వీల్‌చెయిర్‌, అంబులెన్స్‌లో పారా మెడికో, ఒక సహాయకుడు, డ్రైవర్‌ ఉంటారని తెలిపింది.

అంబులెన్సు

అత్యవసర సమయంలో రోగులకు వీరు సేవలందించనున్నట్లు పేర్కొంది. త్వరలోనే ఈ సేవలు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని బ్లింకిట్‌ వెల్లడించింది. 

రోగులకు

వచ్చే రెండు లేదా మూడేళ్లలో ఈ సేవలు అన్ని ప్రధాన నగరాలకు విస్తరిస్తామని బ్లింకిట్‌ సీఈఓ అల్బిందర్‌ ధిండ్సా (Albinder Dhindsa) తెలిపారు.

ఈ సేవలు

పూర్తి స్థాయిలో ‘బ్లింకిట్‌ అంబులెన్స్‌’ సేవలు అందుబాటులోకి వస్తే ప్రజలకు ఎంతగానో ఉపయోగాలు ఉండనున్నాయి. పది నిమిషాల్లోనే రోగులను ఆస్పత్రికి తీసుకెళితే ప్రాణాలు కాపాడే వారవుతారు.

బ్లింకిట్‌ అంబులెన్స్‌