26 December 2024
Subhash
చాలా మంది విమాన ప్రయాణం చేసే ఉంటారు. విమాన ప్రయాణంలో ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని తెలుసుకుని ప్రయాణం చేయడం ఉత్తమం.
మీరు విమానంలో ప్రయాణిస్తుంటే మారిన కొత్త నిబంధనల గురించి తెలుసుకోవాలి. ఈ కొత్త రూల్స్ అమలు కానున్నాయని ఎయిర్‌లైన్స్ పేర్కొన్నాయి.
ఇప్పుడు విమానంలో 1 హ్యాండ్ బ్యాగ్ మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి. దీని బరువు 7 కిలోల కంటే ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువగా ఉంటే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ నియమాలు దేశీయ, అంతర్జాతీయ విమానాలకు వర్తిస్తాయి. బ్యాగ్ పరిమాణం 55x40x20 సెం.మీ ఉండాలి. బరువు 7 కిలోలో మాత్రమే ఉండాలి
ప్రీమియం, ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు 10-12 కిలోల వరకు బ్యాగ్‌లను తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. ఎకనామీ క్లాస్‌లో ఈ పరిమితి 7 కిలోల వరకు ఉంది.
మే 2,2024లోపు కొనుగోలు చేసిన టికెట్లకు పాత నిబంధనలు వర్తిస్తాయి. తదుపరి బుకింగ్‌లకు కొత్త నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది.
బ్యాగ్ బరువు 7 కిలోల కంటే ఎక్కువగా ఉంటే అదనపు ఛార్జీలు చెల్లించాలని, పర్సు లేదా ల్యాప్‌టాప్ వంటి చిన్న బ్యాగులు 3 కిలోల వరకు మాత్రమే తీసుకెళ్లవచ్చు.
ప్రయాణికుల సంఖ్య పెరుగడం వల్ల భద్రతను మెరుగు పర్చేందుకు ఈ మార్పులు జరిగాయి. ఇప్పుడు భద్రతా తనిఖీలు వేగంగా, సులభంగా ఉంటాయి.