రైతులకు శుభవార్త.. జనవరి 1 నుంచి తాకట్టు లేకుండా రూ.2లక్షల రుణాలు!

15 December 2024

Subhash

అన్నదాతలకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. ఎటువంటి ఆస్తుల తాకట్టు లేకుండా తీసుకునే రుణ పరిమితిని రూ.2 లక్షలకు పెంచేసింది. 

అన్నదాతలకు

2025 జనవరి 1వ తేదీ నుంచి తాకట్టు లేకుండా రూ.2 లక్షల వరకూ పంట రుణం తీసుకోవచ్చు. చిన్న, సన్నకారు రైతులకు పంటల సాగు వ్యయం భారం కాకుండా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

జనవరి 1

రోజురోజుకు ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, ఖర్చులు పెరగడంతో రైతులకు రుణ పరపతి సౌకర్యం మెరుగు పర్చాల్సిన అవసరం ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. 

ద్రవ్యోల్బణం

తాజా నిర్ణయం వల్ల  86 శాతం మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. ఇప్పుడు గతంలోకంటే ఇప్పుడు రుణాన్ని రెట్టింపు పొందనున్నారు రైతులు.

రుణాన్ని

తాజా నిర్ణయం మేరకు బ్యాంకులు పంట రుణాలపై కొత్త మార్గదర్శకాలు జారీ చేయడంతోపాటు అన్నదాతల్లో అవగాహన కల్పించాలని ఆర్బీఐ ఆదేశించింది. 

బ్యాంకులు

కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) ద్వారా రుణ సౌకర్యం తేలిక కావడంతోపాటు గవర్నమెంట్ మోడిఫైడ్ ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ స్కీమ్ కింద సరసమైన వడ్డీరేట్లపై రూ.3-4 లక్షల వరకూ రుణం పొందొచ్చు.

బ్యాంకు

2004లో ఎటువంటి తాకట్టు లేకుండా రూ.10 వేల రుణం మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ, క్రమంగా ఆర్బీఐ ఈ పరిమితి పెంచుతూ వస్తోంది. 

తాకట్టు లేకుండా

కింది స్థాయిలో బ్యాంకులు మాత్రం తాకట్టు లేకుండా రుణాలు మంజూరు చేయడం లేదు. దీనివల్ల పంటల సాగు కోసం రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి చిక్కుల్లో పడుతున్నారు.

రుణాలు