18 November 2024
Subhash
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో విదేశాల్లో ఉన్న తమ ఆస్తులు, ఆదాయానికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించకుంటే భారీ జరిమానా.
అప్రకటిత విదేశీ ఆదాయం, నల్లధనం చట్టం, 2015 ప్రకారం రూ.10 లక్షల జరిమానా విధిస్తామని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది.
మీకు విదేశాల్లో ఆస్తి ఉంటే, అది వారసత్వం, ఏదైనా కావచ్చు. విదేశీ బ్యాంకులో ఖాతా ఉన్న కూడా విదేశీ ఆస్తిగా పరిగణిస్తారు.
మీకు విదేశాల్లో ఇల్లు లేదా భూమి ఆస్తి, వాటా, బీమా మొదలైనవి ఉంటే అది విదేశీ ఆస్తిగా పరిగణిస్తారు.
పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌ను ఫైల్ చేసేటప్పుడు ఈ విదేశీ ఆస్తి లేదా విదేశీ మూలాధార ఆదాయాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది.
పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయం పన్ను విధించదగిన పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పటికీ విదేశీ ఆస్తుల వివరాలను నమోదు చేయడం తప్పనిసరి.
ఐటీఆర్ ఫైల్ చేసిన వారికి ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ ద్వారా సమాచారం అందజేస్తున్నారు. ఐటీఆర్ సమర్పణకు డిసెంబర్ 31 వరకు అనుమతి.
2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఇప్పటికే ఐటీఆర్ ఫైల్ చేసి, విదేశీ ఆస్తుల వివరాలను అందించని పక్షంలో, ఇంకా సమయం ఉంది.