15 November 2024
Subhash
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ఐక్యూ13 (iQoo 13) ఫోన్‌ను వచ్చేనెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది.
కస్టమైజబుల్ హలో లైట్ ఫీచర్‌తోపాటు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో వస్తోంది.
గత నెలలో చైనా మార్కెట్లో ఆవిష్కరించిన ఐక్యూ 13 (iQoo 13) ఫోన్ భారత్ మార్కెట్లో రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఈ మేరకు ఐక్యూ 13 ఫోన్ నార్డో గ్రే వేరియంట్ ను కంపెనీ బల పెట్టింది. డిసెంబర్ మూడో తేదీన మార్కెట్లో ఆవిష్కరిస్తుంది.
మూడు కలర్ అసెంట్స్ తోపాటు వైట్ రేర్ ప్యానెల్ తో వస్తుందీ ఐక్యూ 13 ఫోన్. భారత్ మార్కెట్లో నార్డో గ్రే, లెజెండ్ ఎడిషన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
8 డెడికేటెడ్ క్యూ2 గేమింగ్ చిప్ తోపాటు 6.82 అంగుళాల 2కే (1,440×3168 పిక్సెల్స్) 2.0 ఓలెడ్ స్క్రీన్ విత్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
ట్రిపుల్ రేర్ కెమెరాతో వస్తున్న ఐక్యూ 13 ఫోన్ లో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 50-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా.
50-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 120వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జర్, 6,150 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ.