నకిలీ రుణ యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవడంలో భారతీయులే మొదటి స్థానం!

04 December 2024

Subhash

ఈ రోజుల్లో నకిలీ యాప్స్‌ కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. నకిలీ యాప్స్‌ వల్ల వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడిపోతుంది. 

నకిలీ యాప్స్‌

సైబర్‌ నేరగాళ్లు నకిలీ యాప్స్‌ను సృష్టించి వ్యక్తిగత డేటా దొంగిలించడంతో పాటు నిలువునా దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఏజెన్సీ McAfee కీలక నివేదికను విడుదల చేసింది. 

వ్యక్తిగత డేటా 

ఈ నివేదికల ప్రకారం.. నకిలీ రుణ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడంలో భారతీయులు ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నారని స్పష్టం చేసింది. 

రుణ యాప్‌

ఈ నకిలీ యాప్స్‌ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకింగ్ డేటాతో సహా ఎలాంటి అనుమతి లేకుండా దొంగిలిస్తాయి. 

నకిలీ యాప్స్‌

అత్యంత ప్రమాదకరమైన 15 అప్లికేషన్లను 8 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని మెకాఫీ గుర్తించింది.

ప్రమాదకరమైన

చాలా మంది గూగుల్‌ ప్లే స్టోర్ నుండి ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. ఈ యాప్‌లు ప్లే స్టోర్ నుండి తొలగించినప్పటికీ ఇప్పటికీ అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నట్లు McAfee కనుగొంది. 

ప్లే స్టోర్

ఈ అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు వినియోగదారు యాప్‌లకు అనేక అనుమతులు ఇస్తారు. 

యాప్ అనుమతులు

ఈ అప్లికేషన్‌లు మీ స్మార్ట్‌ఫోన్‌లోని సందేశాలు, కెమెరా, మైక్రోఫోన్, స్థానంతో సహా అన్ని ముఖ్యమైన సమాచారాన్ని యాక్సెస్ చేయగలవు.

మీ స్మార్ట్‌ఫోన్‌