01 December 2024
Subhash
బీఎస్ఎన్ఎల్ ఒకదాని తర్వాత మరొకటి కొత్త ప్లాన్‌లను తెస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది.
మీరు అతి తక్కువ ధరలో ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే బీఎస్ఎన్‌ఎల్ జాబితాలో ఒక ప్లాన్ కూడా ఉంది.
ఇక్కడ మీరు కేవలం 200 రూపాయలకే 90 రోజుల వాలిడిటీని పొందుతారు. మీ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.
బీఎస్ఎన్ఎల్ జాబితాలో కొంతమంది కస్టమర్ల కోసం 201 రూపాయల ఆకర్షణీయమైన ప్లాన్ ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో మీకు 90 రోజుల వాలిడిటీ లభిస్తుంది.
ధరల పెంపు తర్వాత ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌లతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు బీఎస్‌ఎన్‌ఎల్ చౌకైన ప్లాన్‌లను తీసుకువచ్చింది.
మీరు ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగించకుంటే తక్కువగా ఉపయోగిస్తుంటే ఇది మీకు ఉత్తమమైన ప్లాన్ కావచ్చు.
ఈ ప్లాన్‌లో మీకు కాల్స్ చేయడానికి 300 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. మీరు ఏ నెట్‌వర్క్‌కైనా ఈ ఉచిత కాలింగ్ నిమిషాలను ఉపయోగించవచ్చు.
ఈ ప్లాన్‌లో మీకు మొత్తం 6GB డేటా ఉంటుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులకు బీఎస్‌ఎన్‌ఎల్ 99 ఉచిత SMSలను కూడా అందిస్తోంది.