28 November 2024
Subhash
కార్లల్లో ధనికులు మాత్రమే కొనుగోలు చేసే కొన్ని బ్రాండ్లు ఉన్నాయి. వాటిలో బీఎండబ్ల్యూ ఒకటి. ఇష్టమైన కారు బ్రాండ్ ఏమిటంటే చాలామంది దీని పేరే చెబుతారు.
సామాన్యులకు కూడా ఈ పేరు సుపరిచితం కావడం విశేషం. ఈ నేపథ్యంలో బీఎండబ్ల్యూ మన దేశంలో 2025 ఎం5 కారును విడుదల చేసింది.
దీని ధర రూ.1.9 కోట్లు (ఎక్స్ షోరూమ్) కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది జూన్ లో ఎం5 కారును బీఎండబ్ల్యూ విడుదల చేసింది.
ముందు భాగంలో ట్విన్ హెడ్ లైట్లు, ఐకానిక్ కిడ్నీ గ్రిల్. ఎల్ ఈడీ హెడ్ లైట్లు, గ్రిల్‌పై ఎంఎస్ బ్యాడ్జి. ముందు, వెనుక ఉండే చక్రాలతో సహా అన్ని బాడీ ప్యానెల్ రీడిజైన్.
కార్బర్ ఫైబర్ రూఫ్ తో ఎం5 అందుబాటులోకి వచ్చింది. పనోరమిక్ సన్ రూఫ్ కలిగిన మోడళ్లతో పోల్చితే 30 కిలోల బరువు తగ్గుతుంది.
రెడ్ మార్కర్‌తో మూడు స్పోక్ ప్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్. యాంబియంట్ లైటింగ్, ఇల్యూమినేటేడ్ ఎం 5 లోగోతో కూడిన మల్టీ ఫంక్షనల్ సీట్లు, బోవర్స్, విల్కిన్స్ 18 స్పీకర్ సౌండ్ సిస్టమ్.
కారులో 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ నుంచి 585 బీహెచ్పీ పవర్, 750 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది.
కేవలం 3.5 సెకన్లలో జీరో నుంచి వంద కిలోమీటర్ల స్పీడ్ ఎత్తుకుంటుంది. గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల స్పీడ్ తో పరుగులు పెడుతుంది.