22 November 2024
Subhash
మన భారతీయ రైల్వేకు ప్రత్యేక స్థానముంది. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో రైల్వే అని చెప్పక తప్పదు.
ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా భారతీయ రైల్వే పేరుగాంచింది. ప్రతీ రోజూ కోట్లాది మంది ప్రయాణిస్తున్నారు.
ప్రపంచంలోనే అతి ఎత్తైన వంతెనపై.. అలాగే ప్రకృతి మధ్యలో నుంచి వెళ్లే రైళ్లు ఉన్నాయి. ఈ కోవలోనే భారతదేశంలో అత్యంత పొడవైన రైలు గురించి కూడా ఉంది.
సాధారణంగా ఓ గూడ్స్ రైలుకు 25.. లేదా మహా అయితే 50 బోగీలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ రైలుకు ఉన్నది ఏకంగా 295 బోగీలు.
ఈ భారీ పొడవైన రైలును లాగేందుకు ఏకంగా 6 ఇంజిన్‌లు ఉంటాయి. ఈ కార్గో రైలు పొడవు సుమారు 3.5 కిలోమీటర్లు.
ఈ రైలు ఏ స్టేషన్ నుంచైనా దాటాలంటే.. దాదాపుగా గంట సమయం పడుతుంది. దేశంలోని వివిధ గనుల నుంచి సేకరించిన బొగ్గు పెద్ద విద్యుత్ ప్లాంట్లకు రవాణా చేస్తుంది.
ఈ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి నాగ్‌పూర్‌లోని రాజ్‌నంద్‌గావ్ వరకు సుమారు 27 వేల టన్నుల బొగ్గును తీసుకెళ్తుంది.
ఈ రెండు నగరాల మధ్య ఉన్న దూరాన్ని సూపర్ వాసుకి ట్రైన్ దాదాపు 11.20 గంటల్లో కవర్ చేస్తుంది. శివుడి మెడలోని వాసుకి సర్పం పేరును ఈ రైలుకు పెట్టారు.