బంగారం కొనుగోలు చేసేవారి కోసం కీలక అప్‌డేట్‌.. అదేంటో తెలుసా?

17 November 2024

Subhash

హాల్‌ మార్కింగ్‌ లేని ఆభరణాలను దేశంలోని 11 రాష్ట్రాల్లో విక్రయించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

హాల్‌మార్కింగ్‌

ఈ నియమం 23 జూన్‌ 2021 నుంచి రూపొందించింది. అయితే దశలవారీగా అమలు చేస్తున్నారు. కల్తీ బంగారం నుంచి ప్రజలను రక్షించేందుకు చర్యలు చేపడుతోంది.

కొత్త నిబంధనలు

దేశంలో11 రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో అమలు.

ఈ రాష్ట్రాల్లో..

 ఇప్పుడు దేశంలో ఇటువంటి 361 జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ హాల్‌మార్కింగ్ లేని ఆభరణాలు, బంగారు కళాఖండాలు నగల దుకాణాల్లో విక్రయించరు.

హాల్‌మర్క్‌

23 జూన్‌ 2021 నుంచి 40 కోట్లకుపైగా బంగారు ఆభరణాలపై హాల్‌ మార్కింగ్‌ అమలు అవుతోంది.  కస్టమర్ల సంక్షేమానికి ఇదో పెద్ద ముందడుగు.

40 కోట్ల నగలపై

గతంలో 34,647 నగల వ్యాపారులు నమోదు చేసుకోగా, ఇప్పుడు ఆ సంఖ్య 1,94,039కు పెరిగింది. ఈ నిబంధనల శరవేగంగా అమలు అవుతోంది.

వ్యాపారుల సంఖ్య

దేశంలో హాల్‌ మార్కింగ్‌ కేంద్రాల సంఖ్య 945 నుంచి 1622కి పెరిగింది. దీని ద్వారా కస్టమర్లు ఆభరణాల నాణ్యతను తెలుసుకోవచ్చు.

హాల్‌ మార్కింగ్ కేంద్రాలు

మీరు BISకేర్‌ యాప్‌ ద్వారా హాల్‌మార్కరింగ్‌ని తనిఖీ చేయవచ్చు. ఈ యాప్‌ నాణ్యతకు హామీ ఇస్తుంది.

యాప్‌ నుంచి