29 November 2024
Subhash
లైఫ్ ఇన్సరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో రకరకాల స్కీమ్‌లో అందుబాటులో ఉన్నాయి.
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బీమా కంపెనీ అయిన ఎల్‌ఐసీలో మంచి రాబడి అందించే అనేక పథకాలు ఉన్నాయి. అలాంటి పాలసీలు తీసుకోవడం మంచిది.
ఎల్‌ఐసీ (LIC)లో ఓ అద్భుతమైన పాలసీ ఉంది. మీరు ప్రతి నెల రూ.17,000 పొందవచ్చు. ఆ పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ పాలసీ. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ. దీని వల్ల మంచి రాబడి పొందవచ్చు.
ఈ పాలసీలో మీరు ఒక్కసారి మాత్రమే డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కనీసం లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
మీరు ఈ పథకంలో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే మీరు రూ.28,625 వార్షిక రాబడిని పొందవచ్చు.
ఈ పాలసీ ద్వారా మీరు ప్రతి నెల రూ.17,000 రాబడి పొందాలంటే మీరు దాదాపు 35 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
రూ.35 లక్షలు పెడితే మీరు ప్రతి సంవత్సరం దాదాపు రూ.2.04 లక్షలు పొందుతారు. మీరు నెలవారీగా తీసుకుంటే రూ.17,000 లభిస్తుంది.