16 January 2025
Subhash
ప్రజలు తమ ఇళ్లలో పెద్ద టీవలను అమర్చుకోవడం మనం తరచూగా చూస్తుంటాము. ఇలాంటి పెద్ద టీవీలలో చూడాలనే ఆశ చాలా మందిలో ఉంటుంది.
టీవీ చూడడానికి ఎంత దూరం ఉండాలో తెలుసా..? మరి దగ్గరగా ఉండి చూస్తే కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
టీవీ స్క్రీన్ పరిమాణం ఆధారంగా ఈ దూరం నిర్ణయించబడుతుంది. అంటే టీవీ ఎంత పెద్దదో అంత దూరం పెరుగుతుంది. టీవీ సైజును బట్టి దూరం ఉంటుందని గుర్తించుకోండి.
స్క్రీన్ పరిమాణం ఆధారంగా దూరాన్ని నిర్ణయిస్తారు. పెద్ద టీవీల ముందు తక్కువ దూరంలో కూర్చుని చూస్తే కళ్లపై ప్రభావం పడుతుంది.
టీవీ పరిమాణం 32 అంగుళాలు ఉంటే మీరు 4 నుంచి 6.5 అడుగుల దూరం మెయింటెయిన్ చేయాల్సి ఉంటుందని గుర్తించుకోండి.
మీ టీవీ 40 అంగుళాలు ఉన్నట్లయితే 8 అడుగుల దూరంగా ఉండి టీవీ చూడాలని గుర్తించుకోండి. ఇంత దూరంలో ఉండి చూడటం తప్పనిసరి.
50 అంగుళాల స్క్రీన్ పరిమాణం ఉన్న టీవీ కోసం 6.25 నుంచి 10.5 అడుగుల దూరం మెయింటెయిన్ చేయాలి.
60 అంగుళాల స్క్రీన్ పరిమాణం ఉన్న టీవీ విషయంలో 7.5 అడుగుల నుంచి 12.5 అడుగుల దూరం ఉండాలని గుర్తించుకోండి.