01 January 2025
Subhash
ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం.. భారతీయ మహిళల వద్ద ఉన్న మొత్తం బంగారం 24,000 టన్నులు. ప్రపంచంలోని మొత్తం బంగారం నిల్వల్లో ఇది 11 శాతం అభరణాల రూపంలో ఉంది.
1) అమెరికా: 8,133 టన్నులు, 2) జర్మనీ: 3,362 టన్నులు, 3) ఇటలీ: 2,451 టన్నులు, 4) ఫ్రాన్స్: 2,436 టన్నులు, 5) రష్యా: 2,298 టన్నులు
ఈ అన్ని దేశాల బంగారాన్ని కలిపితే అది భారతదేశంలోని మహిళల వద్ద ఉన్న 24,000 టన్నుల బంగారానికి సమానం. చైనా మినహా భారత్‌లో గోల్డ్‌కు ప్రపంచంలోనే అత్యధిక డిమాండ్ ఉంది.
ఐఎంఎఫ్ దగ్గర కూడా అంత బంగారం లేదు. ప్రపంచంలోని దాదాపు మూడు వంతుల బంగారాన్ని శుద్ధి చేసే స్విట్జర్లాండ్‌లో ఇంత బంగారం నిల్వలు లేవన్నది వాస్తవం.
భారతదేశం మొత్తం బంగారు నిల్వలలో 40% దక్షిణ భారతదేశంలోనే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ముందంజలో ఉంది.
భారతదేశంలో 28 శాతం బంగారం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. కేరళలో కూడా ప్రజల వద్ద చాలా బంగారం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
భారతదేశంలో బంగారం కొనడం, అమ్మడం కోసం 3% GST ఉంటుంది. ఒక కుటుంబం తమకు నచ్చినంత బంగారం ఉంచుకోవడానికి వీలు లేదు.
వివాహిత మహిళ 500 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చు. అవివాహిత స్త్రీ 250 గ్రాములు, పురుషులు 100 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చని నిబంధనలు చెబుతున్నాయి.