AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో బీజేపీ దూకుడు.. 3 రోజుల్లో ముగ్గురు అగ్రనేతల పర్యటనలు..

తెలంగాణ రాజకీయాల్లో కాషాయ దళం దూకుడు పెంచింది. రాష్ట్రంలో పార్టీకి కొత్త ఊపు తీసుకురావడంతో పాటు.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దలు వరుస కట్టారు. మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు అగ్రనేతలు తెలంగాణ గడ్డపై అడుగుపెట్టనుండటంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

Telangana: తెలంగాణలో బీజేపీ దూకుడు.. 3 రోజుల్లో ముగ్గురు అగ్రనేతల పర్యటనలు..
Amit Shah, Jp Nadda, Nitin Nabin Telangana Tour
Krishna S
|

Updated on: Nov 22, 2026 | 9:59 PM

Share

తెలంగాణలో బీజేపీ ఒక్కసారిగా దూకుడు పెంచింది. రాష్ట్రంలో పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చేందుకు ఢిల్లీ పెద్దలు వరుస కట్టారు. మూడు రోజులు ముగ్గురు అగ్రనేతలు, మూడు కీలక పర్యటనలు. రేపు నితిన్ నబీన్ కరీంనగర్‌లో అడుగుపెడితే.. 24న అమిత్ షా హైదరాబాద్‌కు వస్తారు. ఇక 25న జేపీ నడ్డా సిద్దిపేటలో పర్యటిస్తారు. ఈ వరుస పర్యటనల వెనుక బీజేపీ భారీ రాజకీయ వ్యూహమే కనిపిస్తోంది. సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కరీంనగర్‌లో జరిగే మహా పాదయాత్రలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ చేరుకుని.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కరీంనగర్ వెళ్తారు. మధ్యాహ్నం 1.45 గంటలకు రెండు కిలోమీటర్ల వరకు సాగే పాదయాత్రకు నాయకత్వం వహిస్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని అంతం చేయండి అనే నినాదంతో జరిగే ఈ కార్యక్రమంలో బండి సంజయ్, రామచందర్ రావు, సునీల్ బన్సల్ సహా ముఖ్య నేతలు పాల్గొంటారు. SIR ప్రక్రియపై కాంగ్రెస్, రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలకు కరీంనగర్ వేదికగా సమాధానం చెప్పాలని బీజేపీ భావిస్తోంది.

ఇక నవంబర్ 24న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ITC కాకతీయ హోటల్‌కు వెళ్తారు. అక్కడ సాయంత్రం 6 నుంచి 7.15 గంటల వరకు రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, రాబోయే కార్యాచరణపై నేతలతో చర్చించనున్నారు. అనంతరం రాత్రి 8.50 గంటలకు తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.

మరోవైపు నవంబర్ 25న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా సిద్దిపేటలో జరిగే మహా పాదయాత్రలో పాల్గొననున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఎస్ఐఆర్‌పై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు.. ఓటర్ల జాబితా సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం. ఇలా వరుసగా ముగ్గురు జాతీయ స్థాయి నేతలు తెలంగాణకు రావడం ద్వారా రాష్ట్ర బీజేపీకి కేంద్ర నాయకత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తోందో స్పష్టమవుతోంది. ఈ పర్యటనలను పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు, క్షేత్రస్థాయిలో బీజేపీ బలాన్ని పెంచేందుకు ఉపయోగించుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

Follow Us
తెలంగాణలో బీజేపీ దూకుడు.. 3 రోజుల్లో ముగ్గురు అగ్రనేతల పర్యటనలు..
తెలంగాణలో బీజేపీ దూకుడు.. 3 రోజుల్లో ముగ్గురు అగ్రనేతల పర్యటనలు..
మీ ఇంటి కిచెన్ లో ఉండే ఈ ముక్కలను ముఖం మీద రుద్దితే మెరిసిపోతుంది
మీ ఇంటి కిచెన్ లో ఉండే ఈ ముక్కలను ముఖం మీద రుద్దితే మెరిసిపోతుంది
రష్మిక ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..'మైసా' విడుదల వాయిదా.. కారణమిదే
రష్మిక ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..'మైసా' విడుదల వాయిదా.. కారణమిదే
హైదరాబాద్‌లో హై అలర్ట్.. కాచిగూడకు ఉగ్రవాదుల బెదిరింపు
హైదరాబాద్‌లో హై అలర్ట్.. కాచిగూడకు ఉగ్రవాదుల బెదిరింపు
నోట్లో వేస్తే కరిగిపోయేలా.. సుతిమెత్తని రవ్వ లడ్డు పక్కా కొలతలతో
నోట్లో వేస్తే కరిగిపోయేలా.. సుతిమెత్తని రవ్వ లడ్డు పక్కా కొలతలతో
ఓల్డ్ బైక్స్‌కు మళ్లీ ఫుల్ క్రేజ్.. కొత్త బైక్‌లను మించిన డిమాండ్
ఓల్డ్ బైక్స్‌కు మళ్లీ ఫుల్ క్రేజ్.. కొత్త బైక్‌లను మించిన డిమాండ్
ఆడవాళ్లు vs మగవాళ్లు.. ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్తారు..?
ఆడవాళ్లు vs మగవాళ్లు.. ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్తారు..?
ఈ ఒక్కటి వేస్తే చాలు.. ఒక్క గులాబీ మొక్కకు 100 పైగా మొగ్గలు పక్కా
ఈ ఒక్కటి వేస్తే చాలు.. ఒక్క గులాబీ మొక్కకు 100 పైగా మొగ్గలు పక్కా
ముంబై, కోల్‌కతాకు కొత్త కెప్టెన్లుగా ఎవరో తెలుసా..?
ముంబై, కోల్‌కతాకు కొత్త కెప్టెన్లుగా ఎవరో తెలుసా..?
తక్కువ పదార్థాలతో అద్భుతమైన.. కరకరలాడే కొబ్బరి కజ్జికాయలు
తక్కువ పదార్థాలతో అద్భుతమైన.. కరకరలాడే కొబ్బరి కజ్జికాయలు