రాశి ఫలాలు
, రాశి ఫలాలు

మేషం:  మీ భాద్యతల్లో మరింత శ్రద్ద చూపుతారు.  కాస్త జాప్యం జరిగినా నిదానంగా.. సకాలంలో పూర్తి చేస్తారు. గిప్ట్స్ అందుకునే అవకాశం ఉంది.  ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయి.

వృషభం:  ఈ రోజు మీకు శుభసూచికంగా ఉంది  ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. చేపట్టే ప్రతి పనిలో స్పష్టమైన అనుకూల వాతావరణం కనిపిస్తుంది. వాయిదా పడుతోన్న పనులు ముందుకు కదులుతాయి. ఆర్థికంగా లాభం చేకూరే అవకాశం ఉంది. పక్కన ఉండి మిమ్మల్ని మోసం వ్యక్తులు ఉన్నారు. వారిపై దృష్టి సారించండి.  

, రాశి ఫలాలు
, రాశి ఫలాలు

మిథునం: మిథున రాశివారు ఈ రోజు చేసే ప్రతి పనిలో జాగ్రత్త వహించడం అవసరం. బంధువులతో కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఆరోగ్య విషయాలపై కేర్ తీసుకోండి. వృత్తి విషయంలో సానుకూల వాతావరణం కనిపిస్తోంది. కుదిరితే ఈ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. 

 

కర్కాటకం: విద్యా, వ్యాపార రంగాల్లో సానుకూల పవనాలు ఉన్నాయి. బంధువుల నుంచి మంచి వార్తను వింటారు. పెళ్ళి విషయంలో ఆటంకాలు తొలగిపోతాయి.  కుటుంబసభ్యులతో, సహోద్యోగులతో కానీ.. స్నేహపూర్వకంగా మెలగుతారు. 

, రాశి ఫలాలు
, రాశి ఫలాలు

సింహం: మీరు చేపట్టే పనుల విషయంలో మిత్రుల నుంచి, బంధువుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. ఇంటికి సంభందించిన వాస్తు దోషాలు పరిశీలనకు మంచిరోజుగా సూచిస్తుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం.

 

కన్య: బంధువులతో, మిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. వృతి, వ్యాపారాది రంగాల్లో సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. 

, రాశి ఫలాలు
, రాశి ఫలాలు

తుల: ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. 

 

వృశ్చికం:మీరు తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా అలిసిపోతే, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.  అప్పుకోసం వచ్చిన వారిని, చూడనట్లుగా వదిలెయ్యడం ఉత్తమం.మీకు ప్రియమైన వ్యక్తి/ మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి, జాగ్రత్తగా మాట్లాడండి. 

, రాశి ఫలాలు
, రాశి ఫలాలు

ధనుస్సు: మీరు టెన్షన్ నుండి బయటకు రావడానికి మీ కుటుంబంనుండి సహాయం పొందండి. వారి సహాయాన్ని హుందాగా స్వీకరించండి. మీ భావాలను దాచిపెట్టి ఉంచనక్కరలేదు. మీ సమస్యలను తరచు పంచుకోవడం మంచింది. అతిగా ఖర్చు చేయడం తగ్గించండి. కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు శుభవార్తలు వింటారు

మకరం: ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాతకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. మీరు ప్రేమించినవారితో వివాదాలకు దారితీసి వారిని అప్ సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా, దాటించెయ్యడం ఉత్తమం. మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది.

, రాశి ఫలాలు
, రాశి ఫలాలు

కుంభం:దీర్ఘకాలిక ఋణాలు కొంతవరకు తీరి ఊరట చెందుతారు. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వస్తులాభాలు ఉంటాయి.

మీనం: ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

, రాశి ఫలాలు
, రాశి ఫలాలు

Poll

మన దేశంలో మహిళలపై నేరాలు పెరగడానికి చట్టాల్లో లోపమే కారణమా ?
232 votes · 232 answers
Vote

వైరల్ న్యూస్