Gaja Kesari Yoga: రేపు గురు చంద్రుల కలయిక.. ఏర్పడనున్న గజకేసరి యోగం.. ఈ రాశులకు చెందిన వారు పట్టిందల్లా బంగారమే..
దేవ గురువు బృహస్పతి, చంద్రుడు కలయిక డిసెంబర్ 13 వ తేదీ 2024 సంవత్సరంలో జరగబోతోంది. ఈ గ్రహాల కలయిక వలన గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ యోగా కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. ఆ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం.
జ్యోతిషశాస్త్రంలో చంద్రుడు అత్యంత వేగంగా కదిలే గ్రహంగా పరిగణించబడుతున్నాడు. చంద్రుడు ఒక రాశిలో రెండున్నర రోజులు మాత్రమే ఉంటాడు. దీని కారణంగా ప్రతి 15 రోజులకు మళ్లీ అదే రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా చంద్రుడు ప్రతి రెండు రోజులకు ఒకసారి రాశిని మార్చుకోవడం వలన ప్రజల జీవితాలను వివిధ మార్గాలలో ప్రభావితం చేస్తాడు. అదే విధంగా ఒక్కోసారి ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలోకి రావడం వల్ల వివిధ రకాల యోగాలు ఏర్పడతాయి. అదే విధంగా ఈసారి చంద్రుడు, గురు గ్రహం ఒకే రాశిలోకి ప్రవేశించనున్నాయి. దీంతో గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. జ్యోతిషశాస్త్రంలో ఈ యోగా చాలా శక్తివంతమైనది, శుభప్రదంగా పరిగణించబడుతుంది.
గజకేసరి రాజయోగం ఎప్పుడు ఏర్పడనున్నది.. ఏ రాశులకు శుభం అంటే
హిందూ పంచాంగం లెక్కల ప్రకారం డిసెంబర్ 13 మధ్యాహ్నం 1:18 గంటలకు చంద్రుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ రాశిలో ఇప్పటికే దేవగురువు బృహస్పతి ఉన్నాడు. చంద్రుడు ప్రవేశంలో చంద్రుడు, బృహస్పతి కలయిక జరిగి గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ గజకేసరి యోగం కొన్ని రాశుల వారికీ శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశిలు ఏమిటో తెలుసుకుందాం..
వృషభ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు చంద్రుడు , దేవ గురువు కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ 13న వృషభ రాశిలో గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. అటువంటి పరిస్థితిలో ఈ రాశి వ్యక్తులు తాము కోరుకున్న ఉద్యోగం పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా చాలా లాభాలను పొందవచ్చు. ఎప్పటి నుంచో రాకుండా నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితంలో సమన్వయం పెరుగుతుంది. అవివాహితులకు కూడా వివాహ ప్రతిపాదనలు రావచ్చు.
కన్య రాశి: ఈ రాశి వారికి బృహస్పతి, చంద్రుని కలయిక కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశుల వారు తమ కుటుంబంతో సరదాగా గడుపుతారు. పనిలో విజయం సాధిస్తారు. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలలో లాభసాటి అవకాశాలు ఉంటాయి. దాంపత్య జీవితంలో సామరస్యం, సంతోషం పెరుగుతాయి. అంతేకాదు సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
వృశ్చిక రాశి: గజకేసరి రాజయోగంతో వృశ్చిక రాశి వారు అన్ని రంగాలలో విజయాన్ని పొందుతారు. దీంతో పాటు విపరీతమైన ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో పురోగతితో కొన్ని కొత్త పనులను ప్రారంభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. అదే సమయంలో పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.