AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు చిరంజీవి, అల్లు అర్జున్ ఇళ్లకు ఇటుకలు మోశాడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు యాక్టర్.. ఎవరంటే?

రంగస్థలం కళాకారుడైన ఇతను పలు పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించాడు. తన నటనా ప్రతిభతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటుడిగా, విలన్ గా తనదైన నటనతో మెప్పిస్తున్నాడు. అయితే ఈ టాలీవుడ్ నటుడు ఒకప్పుడు ఈ నటుడు బతుకుతెరువు కోసం కూలీ పనులు కూడా చేశాడు.

Tollywood: ఒకప్పుడు చిరంజీవి, అల్లు అర్జున్ ఇళ్లకు ఇటుకలు మోశాడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు యాక్టర్.. ఎవరంటే?
Laxman Meesala
Basha Shek
|

Updated on: Mar 01, 2026 | 3:45 PM

Share

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న క్యారెక్టర్‌ ఆర్టిస్టుల్లో ఈ నటుడు కూడా ఒకరు. నాటక రంగం నుంచి వచ్చిన సుమారు అతను ఇప్పటివరకు సుమారు 40కు పైగా సినిమాల్లో నటించాడు. హీరో స్నేహితుడిగా, విలన్‌గా, కమెడియన్ గా నటించి మెప్పించాడు. అయితే చాలా మంది లాగే ఈ నటుడు కూడా సినిమాల్లోకి రాక ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పొట్ట కూటి కోసం చేతికందివచ్చిన పనులన్నీ చేశాడు. పదో తరగతి తర్వాత చదువు మానేసిన ఇతను బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. పొట్ట కూటి కోసం ఈ మహా నగరంలో చిన్నా చితకా పనులు చేశాడు. చివరకు కూలీ పనులు కూడా చేశాడు. అలా హైదరాబాద్ లో ఎందరో సినీ ప్రముఖుల ఇంటి నిర్మాణంలో పాలు పంచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కొత్త ఇంటికి .. అల్లు అరవింద్ గారి ఇంటికి, అలాగే అల్లు అర్జున్ ఇళ్ల నిర్మాణంలో భవన నిర్మాణ కూలీగా పని చేశాడు. అలాగే ఫిలిం నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ భవన నిర్మాణానికి కూడా వర్క్ చేశాడు. వీరితో పాటు దిగ్గజ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఇంటి నిర్మాణంలో కూలీగా పనిచేశాడు. అయితే కూలీ పనులు చేస్తూనే తనలోని నటనాభిరుచిని మరింత మెరుగుపరచుకున్నాడు. నాటికలు, నాటకాలు, స్టేజ్ షోలు చేస్తూనే యాక్టింగ్ లో శిక్షణ తీసున్నాడు. స్వయంకృషితో తనకున్న పరిచయాలతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కమెడియన్ గా, విలన్ గా, సహాయక నటుడిగా ఇప్పటివరకు సుమారు 40 సినిమాలు చేశాడు.

మొదట శర్వానంద్ కో అంటే కోటి సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడీ నటుడు. ఆ తర్వాత ప్రతినిధి, నగరం నిద్రపోతున్న వేళ, శమంతక మణి, వంగవీటి, రాధ, ఘాజీ, మనమంతా, ఆర్ ఎక్స్ 100, జార్జ్ రెడ్డి, పలాస, జాంబిరెడ్డి, భీమ్లా నాయక్, మంగళవారం, తంత్ర, సరిపోదా శనివారం శంబాల.. ఇలా దాదాపు 40 కు పైగా సినిమాల్లో నటించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అయితే పాయల్ రాజ్ పుత్ నటించిన ‘మంగళవారం’ సినిమాలో ఇతని యాక్టింగ్ ను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. ఆ నటుడు మరెవరో కాదు మీసాల లక్ష్మణ్.

ఇవి కూడా చదవండి

మీసాల లక్ష్మణ్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

ఇటీవల శంభాల సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటించి మెప్పించాడు మీసాల లక్ష్మీణ్. గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ నటుడు తన వ్యక్తిగత జీవితం గురించి ఇలా చెప్పుకొచ్చాడు. ‘మాది పర్లాకిమిడి దగ్గర రాయనిపేట. చదువు ఒంటపట్టకపోవడంతో మెడికల్ షాపులో కొంతకాలం పనిచేశాను. ఏం చేయాలనే ఆలోచన లేకుండానే హైదరాబాద్ వచ్చేశాను. పొట్ట కూటి కోసం బిల్డింగ్స్ నిర్మాణానికి సంబంధించిన కూలి పనులు చేశాను. అలా చిరంజీవి గారి కొత్త ఇంటికి .. అల్లు అరవింద్ గారి ఇంటికి .. అల్లు అర్జున్ గారి ఇంటికి సంబంధించి కూలీ పనులు కూడా చేశాను. ఇదే సమయంలో దీక్షితులుగారి దగ్గర నటన నేర్చుకున్నాను. ఈ రోజున నేను ఈ స్థాయికి రావడానికి కారకులు ఆయనే’ అని చెప్పుకొచ్చాడు లక్ష్మణ్ మీసాల.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్