Spider Man: ఇండియాలో స్పైడర్ మ్యాన్ ది బ్రాండ్ న్యూ డే క్రేజ్.. ప్రీ రిలీజ్‌లోనే రికార్డులు ఖాయం
టామ్ హాలండ్ నటిస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ భారత బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటకు సిద్ధమైంది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతుండగా, తొలి రోజే భారీ వసూళ్లు సాధించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘అవెంజర్స్: డూమ్స్‌డే’తో కథా అనుబంధం ఉండటంతో మార్వెల్ అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
హాలీవుడ్ ఈవెంట్ ఫిలిమ్స్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. భారీ బడ్జెట్, భారీ ప్రమోషన్స్‌తో వచ్చే ఈ సినిమాలకు ఇక్కడ మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్లో కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఓ సూపర్ హీరో మూవీ ఏకంగా ఆల్ టైమ్ రికార్డులను బ్రేక్ చేసేందుకు రెడీ అవుతోంది. ఏంటా సినిమా.. ఆ మూవీ టార్గెట్ చేస్తున్న రికార్డ్స్ ఏంటి..? ఈ స్టోరీలో చూద్దాం ప్రజెంట్ వరల్డ్ వైడ్‌గా సూపర్ క్రేజ్ ఉన్న మార్వెల్ హీరో టామ్ హాలండ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’. జూలై 30న రిలీజ్ కానున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. బుక్ మై షోలో గంటకు దాదాపు 2,000 టికెట్లు అమ్ముడవుతూ ఈ హాలీవుడ్ ప్రాజెక్ట్ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ లింక్ ఉండటంతో ఈ మూవీపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఈ క్రేజ్‌తో ఇండియాలో తొలి రోజే ఏకంగా 50 నుంచి 60 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే హాలీవుడ్ ఫిల్మ్స్ హిస్టరీలో ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ పేరిట ఉన్న డే 1 ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ అవుతుందని అంచనా వేస్తున్నారు. మార్వెల్ లాంటి హాలీవుడ్ స్టూడియోలు ఇండియన్ మార్కెట్ మీద సీరియస్‌గా ఫోకస్ చేస్తూ ఇక్కడ భారీగా ప్రమోట్ చేస్తున్నాయి. ఈ ప్రమోషన్స్ వల్ల క్రేజీ మూవీస్‌కి ఇండియాలో ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. స్పైడర్ మ్యాన్ గ్లోబల్ మార్కెట్లోనూ ఫస్ట్ వీకెండ్లోనే 4,500 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. బడ్జెట్ ఎంతైనా, ప్రమోషన్స్ రేంజ్ పెరిగేకొద్దీ బాక్సాఫీస్ దగ్గర హాలీవుడ్ సినిమాల స్టామినా ఏంటో ఈ లెక్కలు ప్రూవ్ చేస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Lets Fix Our Food: ఊబకాయంపై యుద్ధం.. ICMR-NIN సంచలన నివేదిక
కెమెరామెన్‌కి బంపరాఫర్.. యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!
Weather Update: దూసుకొస్తున్న వాయు‘గండం’.. దంచికొట్టనున్న వర్షాలు.. వచ్చే మూడు రోజులు ముసురే
Cyber Crime:పార్శిల్ వచ్చింది.. రూ.22 పే చేయమని మెసేస్ వచ్చిందా.. అయితే.. బీ అలర్ట్!
యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!
ఇండియా పోస్ట్ పేరుతో కొత్త సైబర్ మోసం
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!

