AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ‘రామాయణం’ సినిమాపై వివాదం!

మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ‘రామాయణం’ సినిమాపై వివాదం!

Samatha J
|

Updated on: Nov 24, 2026 | 4:21 PM

Share

మహారాష్ట్రలోని సోలాపూర్‌లో రామాయణం సినిమాపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. శ్రీరాముడు, సీత, లక్ష్మణుల పాత్రలను తగ్గించి, రావణుడిని గొప్పగా చూపించారని హిందూ జనజాగృతి సమితి ఆందోళనకు దిగింది. వివాదాస్పద సన్నివేశాలను తొలగించి, తదుపరి భాగాన్ని మత నిపుణుల ఆమోదంతో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతున్న రామాయణం సినిమా ప్రస్తుతం నిరసనల సెగను ఎదుర్కొంటోంది. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఈ చిత్రంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రామాయణం కథలోని ఘట్టాలను చిత్రంలో వక్రీకరించారని ఆరోపిస్తూ హిందూ జనజాగృతి సమితి ఆందోళనకు దిగింది. సోలాపూర్‌లోని చార్ పుతాత్మా చౌక్ వద్ద నిరసనకారులు తమ నిరసనను వ్యక్తం చేశారు. సినిమాలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి పాత్రలను తక్కువ చేసి చూపించారని, అయితే రావణుడి పాత్రను మాత్రం గొప్పగా చూపించారని వారు మండిపడుతున్నారు. దీనివల్ల హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల మంది రాక్షసులను అంతం చేసిన శ్రీరాముడిని రాక్షసుల నుండి పారిపోతున్నట్లు చూపించడం అసత్యమని, ఇది తమకు ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు

 

Follow Us