క్షమించు అమ్మ.. నీ మాట వినాల్సింది

×

క్షమించు అమ్మ.. నీ మాట వినాల్సింది

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నభా నటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన సినిమాలతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది ఈ చిన్నది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా అప్డేట్స్‌తో పాటు, లేటెస్ట్ ఫోటోషూట్స్, అలాగే వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది నభా నటేష్. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఎమోషనల్ పోస్ట్‌ని షేర్ చేసింది. తన తల్లి గురించి ఒక ఎమోషనల్ పోస్ట్‌ని సోషల్ మీడియాలో పంచుకుంది నభా నటేష్. ఆ పోస్ట్‌లో ఆమె మాట్లాడుతూ, “మా అమ్మ ఇచ్చిన సలహాలను నేను ఇన్నాళ్లు పట్టించుకోలేదు. మా అమ్మకేం తెలుసు, నాకే ఎక్కువ తెలుసు అనే ఒక భావనలో ఉండిపోయాను. కానీ మా అమ్మకు తెలిసినన్ని విషయాలు ఎవ్వరికీ తెలియదు. నేను ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి, అతిగా ఆలోచించడం ఎలా తగ్గించుకోవాలి అని చాలా విషయాలు మా అమ్మకే తెలుసు. కానీ నేనేం చేస్తాను? గూగుల్‌లో వెతుకుతాను, రీల్స్ చూస్తాను, అది కూడా కాదంటే మా ఫ్రెండ్స్‌ని అడుగుతాను. ఇలా ఏవేవో ట్రై చేశాను కానీ అడగాల్సింది అమ్మని కదా. అమ్మకు మించి సలహాలు ఇచ్చేవాళ్లు ఎవరైనా ఉన్నారా? ఆవిడ సలహాలు నేను పట్టించుకోలేకపోయాను. సో, ఇప్పుడు నేను ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. క్షమించు అమ్మ, నువ్వు ఇచ్చిన సలహాలను నేను పట్టించుకోలేదు” అంటూ నభా నటేష్ తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్‌ని షేర్ చేసింది. ఈ పోస్ట్‌కి నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అమ్మకు మించి సలహాలు ఇచ్చే వ్యక్తి ఇంకెవ్వరూ లేరు అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకట్టుకుంది.

Phani CH