నరేంద్ర మోదీ
నరేంద్ర మోదీ ప్రస్తుత భారత ప్రధాని. 2014 మేలో తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి దేశ ప్రధాని అయ్యారు. దేశ ప్రధాని కావడానికి ముందు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు.
నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో కూడా పనిచేశారు. ఆయన గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.
2014 లోక్‌సభలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధించింది. దీని తర్వాత, 2019లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ మళ్లీ భారత ప్రధాని అయ్యారు. 2014 నుంచి బీజేపీ మోదీ పేరును ప్రధాన అస్త్రంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించింది.
తన హయాంలో, ప్రధాని మోడీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అయనపై దేశ ప్రజల్లో ఆదరణను మరింత పెంచింది. ఈ నిర్ణయాలలో పాకిస్థాన్‌లో సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ చట్టం అమలు మొదలైనవి ఉన్నాయి.